Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌పై మరిన్ని దాడులు చేయాలి.. భారత్ సర్జికల్ దాడులు సబబే : జర్మనీ

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలపై దాడులు చేయాల్సిందేనని జర్మనీ అభిప్రాయపడింది. అదేసమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన సర్జికల్ దాడులను జర్మనీ సమర్థించింది. ఈ దాడులను ఇ

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (13:30 IST)
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలపై దాడులు చేయాల్సిందేనని జర్మనీ అభిప్రాయపడింది. అదేసమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన సర్జికల్ దాడులను జర్మనీ సమర్థించింది. ఈ దాడులను ఇప్పటికే పలు దేశాలు సమర్థించాయి. తాజాగా ఈ జాబితాలో జర్మనీ కూడా చేరడం గమనార్హం. 
 
ఏ దేశానికైనా తన భూభాగాన్ని రక్షించుకునే హక్కు ఉంటుందని జర్మనీ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ ఉగ్రవాదమైనా, స్థానిక ఉగ్రవాదమైనా... దేశ భద్రతకు సమస్యగా పరిణమించినప్పుడు దాడులు చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ విషయాన్ని భారత్‌లో జర్మనీ రాయబారి మార్టిన్‌ నే స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత బలగాలు చొచ్చుకుపోయి, సర్జికల్ దాడులు నిర్వహించడాన్ని జర్మనీ సమర్థిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా చెప్పారు. 
 
ఏ దేశమైనా మరో దేశంలోకి ఉగ్రవాదాన్ని ప్రవేశించనివ్వబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని మార్టిన్ స్పష్టం చేశారు. అంతేకాదు, తన దేశానికి ఇతర ఏ దేశమైనా ఉగ్రవాద రూపంలో హాని తలపెట్టినప్పుడు... తన భూభాగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశానికి ఉంటుందని తెలిపారు. ఇవి కేవలం తాను చెబుతున్న మాటలు కావని... అంతర్జాతీయ న్యాయ సమాజం కూడా ఇదే విషయాన్ని చెబుతోందని ఆయన గుర్తు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments