నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారు... ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపండి.. షరీఫ్ ఆదేశాలిచ్చారా?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారనీ, అందువల్ల ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేసినట్టు పాక్‌కు చెందిన ప్రముఖ పత్రిక డాన్ ఓ ఆసక్తికర కథనా

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (13:13 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారనీ, అందువల్ల ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేసినట్టు పాక్‌కు చెందిన ప్రముఖ పత్రిక డాన్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అదీ కూడా 'అసాధారణ మార్పు' అనే పేరుతో ఈ కథనాన్ని ప్రచురించి పెద్ద చర్చకే తెరలేపింది. 
 
ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే మహమ్మ‌ద్‌తో పాటు ప‌లు ఉగ్రవాద సంస్థలను క‌ట్ట‌డి చేయ‌డానికి పూనుకుంద‌ని తెలిపింది. పాక్‌ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవ‌లే ర‌హ‌స్య స‌మావేశం నిర్వ‌హించార‌ని, అందులో ఈ అంశంపై ఆర్మీకి ఆదేశాలు జారీ చేశార‌ని ఆ పత్రికా కథనంలో పేర్కొంది. 
 
ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపడితే అందులో ఆ దేశ జ‌వాన్ల ఆధ్వర్యంలోని నిఘా సంస్థలు క‌ల్పించుకోకూడ‌ద‌ని ష‌రీఫ్ చెప్పిన‌ట్లు పాక్ ప‌త్రిక‌ పేర్కొంది. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా.. ఈ దాడి తర్వాత అంతర్జాతీయంగా పాకిస్థాన్ దోషిగా నిలబడింది. దీంతో నవాజ్ షరీఫ్ ఈ తరహా అసాధారణ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

తర్వాతి కథనం
Show comments