Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసివున్న ఫోటోను అప్‌లోడ్ చేసిందనీ... కుమార్తెను చితక్కొట్టిన తల్లి...

ఫేస్‌బుక్‌లో అశ్లీల ఫోటో పోస్ట్ చేసిందనీ కుమార్తెను చితక్కొట్టింది. అక్కడితో ఆగకుండా ఈ ఉదంతాన్ని వీడియో తీయించి తన కుమార్తె ఫేస్బుక్ పేజీలోనే ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ ఘటన అమెరికాలోని జార్జియాలో చ

Webdunia
బుధవారం, 27 జులై 2016 (14:23 IST)
ఫేస్‌బుక్‌లో అశ్లీల ఫోటో పోస్ట్ చేసిందనీ కుమార్తెను చితక్కొట్టింది. అక్కడితో ఆగకుండా ఈ ఉదంతాన్ని వీడియో తీయించి తన కుమార్తె ఫేస్బుక్ పేజీలోనే ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ ఘటన అమెరికాలోని జార్జియాలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... షనవియా మిల్లర్ అనే మహిళ కట్టె తీసుకుని తన కూతుర్ని చితక్కొట్టింది. తర్వాత ఉత్తి చేతులతో విక్షణారహితంగా బాదింది. బాయ్ఫ్రెండ్‌తో కలిసివున్న అభ్యంతకర ఫొటోను తన కూతురు ఫేస్బుక్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. 
 
కూతురి చేతిలోని సెల్‌ఫోన్ లాక్కుని అక్కడే ఉన్న మరొకరి దాన్ని ఇచ్చి వీడియో తీయమంది. తర్వాత కుమార్తెపై విరుచుకుపడింది. తల్లి బారి నుంచి తప్పించుకునేందుకు ఇంట్లో మూలకు వెళ్లి దాక్కున్నా మిల్లర్ వదిలిపెట్టలేదు. నా పరువు తీస్తావా? అంటూ చెడామడా చెంపదెబ్బలు వాయించింది. ఇదంతా కూతురి ఫేస్బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేసి, షేర్ చేయాలని ఫాలోవర్లను కోరింది. 
 
అయితే, ఈ చర్యను ఆ మహిళ సమర్థించుకుంది. తన కుమార్తె అంటే ఎంతో ఇష్టమని, ఆమె అభాసుపాలు కాకూడదన్న ఉద్దేశంతో గట్టిగా మందలించానని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను కొత్తమంది సేవ్ చేసి, యూట్యూబ్‌లో పెట్టారు. తన తల్లి బాధను అర్థం చేసుకున్నానని, ఆమెపై కోపం లేదని మిల్లర్ కుమార్తె పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments