Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా గ్యాస్ పైప్ లేన్‌లో భారీ పేలుడు - 12 మంది మృతి

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (16:32 IST)
చైనాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు. హ్యూబెయ్ ప్రావిన్స్‌లోని షియాన్ సిటీలోని ఓ నివాస సముదాయం వద్ద గ్యాస్ పైప్ లైన్ పేలుడు సంభవించిందని స్థానిక సీసీటీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 
 
ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయారు. 144 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో మరో 37 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. 
 
2013లో ఈశాన్య ప్రాంతంలోని ఖింగ్డావోలో జరిగిన పేలుడులాగే ఈ పేలుడూ సంభవించి ఉంటుందని చెబుతున్నారు. అప్పుడు భూగర్భంలోని పైప్ లైన్‌లు లీకై పెద్ద పేలుడు సంభవించడంతో 55 మంది చనిపోయారు.
 
కాగా, 2015లో ఓ రసాయన గోదాములో జరిగిన ప్రమాదంలో 173 మంది మరణించారు. అందులో ఎక్కువగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులే ఉన్నారు. గోదామును అక్రమంగా నిర్మించడం, అనుమతుల్లేకుండా రసాయనాలను దాచడం వల్లే ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments