Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు మత్తుమందిచ్చి.. పరాయి పురుషుల కోర్కెలు తీర్చిన భర్త... ఎక్కడ?

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (18:41 IST)
ఫ్రాన్స్‌లోని మజాన్‌లో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భార్యకు మత్తు మందు ఇచ్చి, పరాయి పురుషులతో కట్టుకున్న భర్త అత్యాచారం చేయించాడు. అలా ఏకంగా 92 సార్లు లైంగికదాడి చేయించాడు. ఈ కేసులో ఫ్రాన్స్ పోలీసులు 51 మంది కామాంధులను అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
డొమినిక్ అనే వ్యక్తి తన భార్యకు ప్రతి రోజూ రాత్రి లోరజపామ్ అనే సెడేటివ్ మత్తు మందును అన్నంలో కలిపి తినిపించేవాడు. దాంతో ఈమె స్పృహ తెలియకుండా నిద్రలోకి జారుకునేందు. ఇదే అదునుగా భావించిన డొమినిక్.. తనలోని కిరాతక చర్యను బయటపెట్టేవాడు. 
 
తన స్నేహితులతో పాటు పరాయి పురుషులను ఇంటికి రప్పించి భార్యపై అత్యాచారం చేయించేవాడు. వీరిలో 23 యేళ్ల నుంచి 73 యేళ్ళ వయసున్న వారు కూడా ఉన్నారు. ఇలా కట్టుకున్న భార్యపై పరాయి పురుషులు అత్యాచారం చేస్తుంటే, డొమినికి చూస్తూ పైశాచికానందం పొందడమే కాకుండా, వీడియో తీసేవాడు. వాటిని యూఎస్బీ డ్రైవ్‌లో సేవ్ చేశారు. 
 
ఈ దారుణం వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2011 నుంచి 2020 మధ్య కాలంలో ఈ దారుణం జరిగింది. మొత్తం 92 సార్లు లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ అత్యాచారానికి పాల్పడిన వారిలో 51 మందిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ నీచానికి పాల్పడిన డొమినిక్‌, బాధితురాలికి ముగ్గురు పిల్లలు కూడా ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం