Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థికి 14 యేళ్ళు.. టీచరమ్మకు 22 యేళ్లు.. స్కూల్‌లో శృంగారం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (08:59 IST)
ఇటీవలి కాలంలో కేవలం విద్యార్థుల ప్రవర్తన హద్దులుదాటివుంటుంది. వారిని సక్రమ మార్గంలో నడిపించాల్సి ఉపాధ్యాయుల్లో కొందరు వక్రమార్గంలో ప్రయాణిస్తున్నారు. ఈ కారణంగా పలు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా 22 యేళ్ల టీచరమ్మ ఒకరు 14 యేళ్ల విద్యార్థితో స్కూల్‌లో శృంగారంలో పాల్గొంది. ఈ విషయం వెలుగులోకి రాగానే, పోలీసులు విచారణ జరిపి ఆమెను అరెస్టు చేశారు. ఈ సంఘటన అమెరికాలోని మాంట్‌గోమెరి కౌంటీలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
మాంట్‌గోమెరి విలేజ్ మిడిల్ స్కూల్‌లో గతంలో మెలిసా మేరీ కర్టిస్ అనే మహిళ టీచరుగా పని చేసింది. గత 2015లో అదే పాఠశాలలో ఎనిమిదో గ్రేడ్ చదువుతున్న 14 యేళ్ల బాలుడిని తన దారికి తెచ్చుకుని శృంగారంలో పాల్గొంది. అపుడు ఆమెకు 22 సంవత్సరాలు. ఈ క్రమంలో తాను విద్యార్థిగా ఉన్న సమయంలో కర్టిస్ తనతో బలవంతంగా శృంగారంలో పాల్గొందని బాధిత విద్యార్థి ఆరోపణలు చేశాడు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కర్టిస్ విద్యార్థితో పాడు పనికి పాల్పడినట్టు తేలింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బాధిత విద్యార్థికి పలుమార్లు మద్యం తాగించి, గంజాయి ఇచ్చి టీచర్‌ కర్టిస్ శృంగారంలో పాల్గొన్నట్టు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. దీంతో అక్టోబరు 31వ తేదీన అరెస్టు వారెంట్ జారీ చేశామని, సదరు మాజీ టీచరుపై పలు కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధిత విద్యార్థులు వుంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments