Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రియుడి పురుషాంగాన్ని కత్తిరించిన భర్త.. ఎక్కడ?

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (13:51 IST)
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి పురుషాంగాన్ని కత్తిరించాడు. ఇపుడు పశ్చాత్తాపపడుతున్నాడు. తాను ఆ పనిని తెలివితక్కువతనంతో చేశానంటూ కోర్టులో చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫ్లోరిడాకు చెందిన అలెక్స్ బొనిల్లా(51) అనే వ్యక్తి భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్యను పలుమార్లు మందలించాడు. కానీ, ఆమె ప్రవర్తనలో మార్పులేదు. దీంతో వారికి తగిన గుణపాఠం చెప్పాలని భావించాడు. అంతే... భార్య ప్రియుడి ఇంటికి వెళ్లి అతడి పురుషాంగాన్ని కత్తిరించేశాడు. 
 
అలెక్స్ తన భార్య ప్రియుడి ఇంటికి వెళ్లి తుపాకీతో అతడిని బెదిరించాడు. అతడిని తాళ్లతో కట్టేసి ‘నువ్వు ఈ రోజు చావడం లేదు. కానీ ఈ రోజును నువ్వు జీవితాంతం గుర్తుంచుకుంటావు’ అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం ఓ కత్తెర తీసుకుని అతడి పురుషాంగాన్ని కత్తిరించేశాడు. బాధితుడి ఇద్దరు కూతుళ్ల కళ్లెదుటే అలెక్స్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటన 2019 జూలైలో ఈ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... అలెక్స్‌ను అరెస్టు చేశారు. దాదాపు రెండేళ్ల నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తోంది. అలెక్స్‌ను గురువారం మరోసారి జడ్జి ముందు ప్రవేశపెట్టగా.. తెలివితక్కువగా, స్పృహలో లేకుండా ఈ దారుణానికి పాల్పడ్డానంటూ అలెక్స్ జడ్జితో చెప్పాడు. అలెక్స్‌ను కోర్టు దోషిగా తేల్చితే అతడికి 30 ఏళ్ల జైలుశిక్ష విధించే అవకాశముంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం