Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాక్షసుడు.. మహిళను చంపి గుండెతో కూర చేశాడు.. వారితో తినిపించి..?

Advertiesment
రాక్షసుడు.. మహిళను చంపి గుండెతో కూర చేశాడు.. వారితో తినిపించి..?
, గురువారం, 25 ఫిబ్రవరి 2021 (10:11 IST)
మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. ప్రేమ కోసం ప్రేమోన్మాదులు ఓవైపు దాడులకు పాల్పడుతుంటే.. మరోవైపు కామాంధులు మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కిరాతకుడు మహిళను చంపి, ఆమె గుండెతో కూర చేశాడు. మానవుడిగా కాకుండా రాక్షసుడిగా ప్రవర్తించాడు. 
 
అంతటితో ఆగకుండా ఆమె గుండెతో వండిన కూరను తన అత్త కుటుబానికి తినిపించి.. వారిని కత్తులతో నరికాడు. ఇలా మొత్తం ముగ్గురి పొట్టనబెట్టున్నాడా రాక్షసుడు. ఈ దుర్ఘటన అమెరికాలోని ఓక్లాహామాలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఓక్లహామాలోని చికాషా ప్రాంతానికి చెందిన లారెన్స్ పాల్ అండర్సన్ అనే వ్యక్తి తన అత్త మామ లియో పై, డెస్లీ పైతో కలిసి నివసిస్తున్నాడు. 
 
ఐతే ఈ నెల 9న తన పక్క ఇంట్లో ఒంటరిగా ఉండే ఓ మహిళను కత్తితో నరికి చంపాడు. ఆమెను చంపిన తర్వాత శరీరాన్ని కోసి ఆమె గుండెను బయటకు తీశాడు. దానిని వెస్ట్ మిన్నెసోటాలో ఉన్న తమ ఇంటికి తీసుకెళ్లి.. ఆలుగడ్డలతో కలిపి కూర చేశాడు. ఆ కర్రీని తన అత్త మామలతో పాటు వారి నాలుగేళ్ల మనవరాలికి కూడా తినిపించాడు. అనంతరం వారిపైనా కత్తులతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆయన మామ లియోపై, నాలుగేళ్ల పాప మరణించింది. 
 
అత్త డెస్లీ పై తీవ్రంగా గాయపడింది. దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా మొత్తం ముగ్గురు వ్యక్తులను కిరాతకంగా చంపేశాడు. చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పాల్ అండర్సన్‌ను అరెస్ట్ చేశారు.
 
విచారణలో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది. దెయ్యాల నుంచి కాపాడుకునేందుకే ఇలా చేశానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా, లారెన్స్ పాల్ అండర్సన్ గతంలో నేర చరిత్ర ఉంది. అతడి మానసిక పరస్థితి సరిగ్గా లేదని పోలీసులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరసారావుపేటలో దారుణం.. డిగ్రీ విద్యార్థిని చంపేసిన ప్రేమోన్మాది