Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా కేసులు.. వృద్ధ జంట వళ్లే కోవిడ్ వ్యాపించిందా?

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (21:22 IST)
కరోనా పుట్టిల్లు చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు ప్రకటించింది చైనా. అక్కడి అధికారులు వందలాది విమానాలు రద్దు చేశారు. స్కూల్స్ మూసివేశారు. కోవిడ్ పరీక్షల వేగాన్ని పెంచి.. గురువారం భారీగా పర్యాటకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కొన్ని ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ అవి తాత్కాలికంగా పరిమితులను తగ్గిస్తున్నాయి.
 
కానీ, చైనా మాత్రం దేశీయంగా అన్నిటినీ మూసివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరిహద్దులను మూసివేయడంతో కరోనా విషయంలో చైనా చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో బాంబు చైనా పేలుస్తుందా అనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి.
 
అధికారులు చెబుతున్నదాని ప్రకారం చైనా వరుసగా ఐదవ రోజు కొత్త కేసులను నమోదు చేసింది. ఎక్కువగా ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఉంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణంగా పర్యాటకులను పేర్కొంటున్నారు. 
 
జియాన్, గన్సు ప్రావిన్స్ అదేవిధంగా ఇన్నర్ మంగోలియా వెళ్ళే ముందు ఒక వృద్ధ జంట షాంఘైలో పర్యటించారు. రాజధాని బీజింగ్‌తో సహా కనీసం ఐదు ప్రావిన్సులు.. ప్రాంతాలలో సన్నిహిత పరిచయాలతో డజన్ల కొద్దీ కేసులు వారి ప్రయాణంతో ముడిపడి ఉన్నాయి. 
 
వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు చెబుతున్నారు. దీంతో విమాన సర్వీసులు రద్దు చేయడమే కాకుండా.. పర్యాటకులను పూర్తిగా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వారిపై ఆంక్షలు విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. ఇంటిలోనే ఉరేసుకున్న దర్శకుడు...

అమరన్‌తో అదరగొట్టింది.. కానీ అక్కడ దొరికిపోయిన సాయి పల్లవి

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments