Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేలు ఉపఎన్నిక ముగిసే సమయానికి 72గం.ల ముందు ప్రచారం నిలిపివేయాలి:సిఇఓ

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (20:34 IST)
ఈ నెల 30వ తేదీన కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసే సమయానికి 72గం.ల ముందు అనగా (ఈనెల 27వతేదీ సా.7గం.ల నుండి 30వతేదీ సా.7గం.ల వరకూ)ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని నిలిపి వేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మరియు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ తెలియ జేశారు.

పోలింగ్ ముగిసే సమయానికి 72గం.ల ముందు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయరాదని ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా తోపాటు ఇతర మార్గాల్లోను ప్రచారం చేయడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు.

1951 ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 126(1)(బి) ప్రకారం పోలింగ్ సమయం ముగిసే 72గం.ల ముందు ఎన్నికల ప్రచారానికి సంబంధించి పోలింగ్ జరిగే ప్రాంతంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సినిమాటోగ్రఫీ,టెలివిజన్ చానళ్ళు లేదా ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా గాని ఎలాంటి ప్రచారాలు నిర్వహించడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు.

అదేవిధంగా పోలింగ్ ముగిసేందుకు 72గం.ల ముందు అనగా ఈనెల 27వతేదీ సా.7గం.ల నుండి 30వతేదీ సా.7గం.ల వరకూ ఒపీనియన్ పోల్ లేదా పోల్ సర్వేకు సంబంధించిన వివరాలను గాని ఎలక్ట్రానికి మీడియా చానళ్ళ ద్వారా ప్రచారం చేయడం లేదా వెల్లడించాన్నినిషేధించడం జరిగిందని సిఇఓ విజయానంద్ స్పష్టం చేశారు.

కావున ఈవిషయమై రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ కమీషనర్ వారిని అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ కోరారు.

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments