Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్రంతో విమానయానం

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:24 IST)
విమానంలో ప్రయాణం అంటే చాల మంది ఇష్టపడుతుంటారు. కొంత మందికి విమానం ఎక్కడం ఓ కల. మరికొంత మందికి విమానం ఎక్కాలన్న వారి దగ్గర డబ్బులు ఉండవు. కానీ శ్రీమంతులకు మాత్రం విమానం ఎక్కటం చాల ఈజీ.

ఎక్కువ మంది వారితో పాటు పెంపుడు జంతువుల్ని కూడా విమానంలో తీసుకెళుతుంటారు. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటివి తీసుకెళుతుంటారు. కానీ ఓ మహిళ మాత్రం ఏకంగా గుర్రంతో పాటు విమానం ఎక్కింది. అది చూసిన పాసింజర్స్ షాక్ అయ్యారు.

ఏదో చిన్న చిన్న జంతువుల్ని విమానంలో తీసుకెళ్లటం చూశాం కానీ ఏకంగా గుర్రాన్ని తీసుకురావటమేంటని ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన ఘటన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకుంది.

అమెరికాలో చికాగో నుంచి నెబ్రస్కా నగరంలోని ఒమహాకు వెళ్లటానికి ఓ మహిళ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కింది. ఆ మహిళ తన పెంపుడు జంతువు గుర్రంతో పాటు విమానంలోకి ఎక్కి తన సీటులో కూర్చొంది. అది చూసి ప్రయాణీకులంతా ఆశ్చర్యపోయారు.

నోరెళ్లబెట్టి మరి ఆమె వంకా.. గుర్రం పిల్ల వంకా చూస్తుండిపోయారు. ఇది ఫ్లిర్లీ నా ముద్దుల బుజ్జి గుర్రం పిల్ల అని తోటి పాసింజర్స్‌కు పరిచయం చేసింది మహిళ. పొట్టిగా క్యూట్‌గా ఉన్న ఆ గుర్రపు పిల్ల ఏమాత్రం అల్లరి చేయకుండా.. చక్కగా బుద్దిగా ఉంది.

తన యజమానురాలి కాళ్ల వద్దే పడుకుని ప్రయాణం సాగించింది. అయితే క్యూట్‌గా ఉన్న ఆ గుర్రం పిల్ల వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. మనుషులకు ఎమోషనల్‌గా దగ్గరైన జంతువుల్ని విమానాల్లో తీసుకెళ్లవచ్చని అమెరికా ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది.

అయితే అలా తీసుకెళ్లే జంతువులకు సంబంధించిన వివరాలను ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. అప్పటి నుంచి అమెరికన్లు తమ పెంపుడు జంతువులతో చక్కగా విమానంలో చక్కర్లు కొట్టేస్తున్నారు. కాకపోతే విమానంలో పెద్ద పెద్ద జంతువులకు అనుమతిలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments