Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్‌లో మహిళా జడ్జీల కోసం సాగుతున్న తాలిబన్ల వేట

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (10:39 IST)
గత రెండు దశాబ్దాల కాలంలో తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన, శిక్షలు విధించిన మహిళా జడ్జీల కోసం తాలిబన్ తీవ్రవాదులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇలాంటివారిలో ఇప్పటికే అనేక మంది దేశాన్ని వీడిపోయారుకూడా. మిగిలిన వారు ప్రాణాలు అరచేతలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ దొంగచాటుగా జీవిస్తున్నారు. ఇలాంటి వారంతా రహస్య ప్రాంతాల్లో దాక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 
 
ఆప్ఘన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఎంతోమంది నేరగాళ్లకు విముక్తి ప్రసాదించారు. వారిని జైళ్ల నుంచి విడుదల చేశారు. అలా విడుదలైన వారిలో దాదాపుగా అందరూ గతంలో తాలిబన్ల తరపున పనిచేసినవారే. వివిధ నేరాల్లో దోషులుగా తేలిన వీరికి శిక్ష విధించడమే మహిళా న్యాయమూర్తులు చేసిన పాపం. 
 
జైలు నుంచి విడుదలైన నేరస్థులు.. ప్రస్తుతం మహిళా న్యాయమూర్తుల కోసం గాలిస్తున్నారు. తమకు శిక్ష వేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో 220 మందికిపైగా మహిళా న్యాయమూర్తులు ప్రాణ భయంతో దాక్కున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments