Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిస్సహాయ స్థితిలో ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్లు

నిస్సహాయ స్థితిలో ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్లు
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (10:26 IST)
తాలిబన్ ఉగ్రవాదుల వశమైన ఆప్ఘనిస్థాన్ దేశంలో మహిళా క్రీడాకారుల పరిస్థితి మరింత దయనీనంగా మారింది. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయనుండటంతో అనేక వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర భయాందోళలకు గురవుతున్నారు. వీరిలో ఎక్కువగా మహిళా క్రీడాకారులో ఉన్నారు. తాలిబన్ తీవ్రవాదుల దెబ్బకు భయపడి ఇప్పటికే అనేక మంది క్రీడాకారులు దేశం విడిచి వెళ్లిపోయారు. 
 
ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ మహిళా క్రికెట్ జట్టు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తాలిబన్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ను వశపరుచుకున్నప్పటి నుంచి మహిళా క్రికెటర్ల కోసం గాలిస్తున్నారు. కానీ వారు కంటికి చిక్కలేదు. ఈ నేపథ్యంలో ఆప్ఘన్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఓ మహిళా క్రికెటర్ ఆందోళన వ్యక్తం చేసింది.
 
కాబూల్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, మహిళా క్రికెటర్లే కాకుండా ఇతర క్రీడలకు సంబంధించిన మహిళలు ప్రస్తుతం సురక్షితంగా లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబన్లు కాబూల్‌లో ప్రవేశించినప్పటి నుంచి తన క్రికెట్ కిట్ దాచేశానని, ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టడంలేదని వివరించింది.
 
తాలిబన్లు ఇప్పటికే తమను బెదిరించారని, మరోసారి క్రికెట్ ఆడితే ప్రాణాలు పోతాయని హెచ్చరించారని ఆ మహిళా క్రికెటర్ వెల్లడించింది. తమకు ఓ వాట్సాప్ గ్రూప్ ఉందని, ప్రతి రోజు రాత్రివేళల్లో తమ పరిస్థితిపై చర్చించుకుంటామని వివరించింది. ప్రస్తుతానికి తాము నిస్సహాయ స్థితిలో ఉన్నామని తెలిపింది.
 
కాగా, మరో మహిళా క్రికెటర్ ఆఫ్ఘన్ విడిచి వెళ్లిపోయింది. తొలుత తాలిబన్లకు చిక్కకుండా ఉండేందుకు అనేక ఇళ్లు మారిన ఆ క్రికెటర్, చివరికి దేశాన్ని వీడింది. క్రికెటర్లే కాదు, ఆఫ్ఘన్ లో మహిళా ఫుట్ బాల్ జట్టు పరిస్థితి కూడా ఇందుకు భిన్నం కాదు. వీరిలో చాలామంది ఇప్పటికే పలు యూరప్ దేశాలకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్యాస్ సిలిండర్ లీక్ అవుతోందా? 1906 కాల్ చేయండి