Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషివా... ట్రంప్‌వా... రెండోసారి బండకేసి బాదినా చలించని ట్రంప్

మనిషిపట్ల నిషేధం విధించే ఈ కంగాళీ ఉత్తర్వులు ఏంటి అంటూ మళ్లీ ధిక్కరించిన ఆ అమెరికన్ న్యాయానికి చేతులెత్తి జోడించాలి. చేటదెబ్బలు, పొరక దెబ్బలూ రెండూ తగులుతున్నా మీద పడిన ఎంగిలిని సుతారంగా తుడుచుకున్నట్లు భుజాలెగరేస్తున్న ఆ మానవద్వేషి ట్రంప్‌ను చచ్చేంత

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (03:32 IST)
మనిషిపట్ల నిషేధం విధించే ఈ కంగాళీ ఉత్తర్వులు ఏంటి అంటూ మళ్లీ ధిక్కరించిన ఆ అమెరికన్ న్యాయానికి చేతులెత్తి జోడించాలి. చేటదెబ్బలు, పొరక దెబ్బలూ రెండూ తగులుతున్నా మీద పడిన ఎంగిలిని సుతారంగా తుడుచుకున్నట్లు భుజాలెగరేస్తున్న ఆ మానవద్వేషి ట్రంప్‌ను చచ్చేంతవరకూ ఇలానే బాదుతూనే ఉండాలి. ఈ నిషేధం అమల్లోకి వస్తే ‘కోలుకోలేని గాయం’ అంటూ మరోసారి ఎలుగెత్తి చాటిని ఆ మాన్య మహనీయ జడ్జి తీర్పు చరిత్ర పుటల్లో అలాగే వెలుగుతుండాలి. ఇక వందసార్లు మానవ నిషేధ చట్టాల జోలికి పోయినా ట్రంప్‌కు శృంగ భంగమేనన్న ధైర్యాన్నిచ్చిన ఆ న్యాయదీపం ముందు శిరసు వంచి నమస్కరించాలి.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆరు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు, శరణార్థులు అమెరికా రాకుండా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకువచ్చిన తాజా వలస నిషేధ ఉత్తర్వులకు కూడా హవాయ్‌ ఫెడరల్‌ కోర్టు బ్రేకులు వేసింది. అమెరికాలో మరికొద్ది గంటల్లో అమలు కావాల్సిన వలస నిషేధాజ్ఞలను అమలుచేయడానికి అంగీకరించబోమని హవాయ్‌ ఫెడరల్‌ కోర్టు జడ్జి డెరిక్‌ వాట్సన్‌ స్పష్టం చేశారు. ఏడు ముస్లిం దేశాల ప్రజలు అమెరికాకు రాకుండా వలస నిషేధాజ్ఞలను ట్రంప్‌ గత నెలలో అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిం దే.
 
అయితే ఆ ఉత్తర్వులను పలు ఫెడరల్‌ కోర్టులు నిర్ద్వంద్వంగా నిలిపివేశాయి. దీంతో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ట్రంప్‌ తాజాగా సవరించిన నిబంధనలతో వలస నిషేధాజ్ఞలను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఈసారి ఇరాక్‌కు మినహాయింపు ఇచ్చి ఇరాన్, లిబియా, సోమాలియా, çసూడాన్, సిరియా, యెమన్‌ తదితర ఆరు ముస్లిం దేశాలపై నిషేధం విధించారు. ట్రంప్‌ కొత్త ఆదేశాల ప్రకారం ఆరు ముస్లిం దేశాల వలసదారులపై 90 రోజులు, శరణార్థులపై 120 రోజులు నిషేధం ఉంది.
 
ఈ ఆదేశాలు ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. సరిగ్గా ఈ ఉత్తర్వులు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండ గానే.. ఇది చట్టబద్ధంగా లేదంటూ హవాయ్‌ జడ్జి వాట్సన్‌ నిషేధాన్ని నిలిపివేశారు. ఈ నిషేధం అమల్లోకి వస్తే ‘కోలుకోలేని గాయం’ తగులుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులు అమల్లోకి వస్తే మత సమానత్వం, స్వేచ్ఛను కాపాడే ‘ఎస్టాబ్లిష్‌మెంట్‌ క్లాస్‌’ను ఉల్లంఘించినట్టే అవుతుందన్నారు. మేరీల్యాండ్‌ కోర్టు కూడా ట్రంప్‌ నూతన వలసల నిషేధ ఉత్తర్వుల్లోని కొన్నింటిపై స్టే విధించింది.  
 
తీర్పును స్వాగతించిన పలు గ్రూపులు
ఈ తీర్పును ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీ, పలు రైట్‌ గ్రూపులు, ఇండియన్‌– అమెరికన్‌ గ్రూపులు స్వాగతించాయి. హవాయ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్‌ కాంగ్రెస్‌ మహిళ తుల్సీ గబ్బర్డ్‌ వలస నిషేధం అనేది చెడు విధానమని వ్యాఖ్యానించారు. జాతి వివక్షకు పాల్పడే వారు ఎవరైనా చివరకు అధ్యక్షుడైనా ఒప్పుకోమన్నది ఈ తీర్పు సారాంశమని సౌత్‌ ఏసియన్‌ అమెరికన్స్‌ లీడింగ్‌ టుగెదర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుమన్‌ రఘునందన్‌ అభివర్ణించారు. ముస్లింలను దేశంలోకి ప్రవేశించనీయకుండా చేయడం తప్పని ఈ తీర్పు రుజువు చేసిందన్నారు.
 
సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తాం ట్రంప్‌
కోర్టు ఆదేశాలను ట్రంప్‌ తప్పుపట్టారు. న్యాయ వ్యవస్థ అతిగా ప్రవర్తిస్తోందంటూ  ట్వీట్‌ చేశారు. ఈ తీర్పు మమ్మల్ని బలహీనపరిచే విధంగా ఉందని.. దీనిపై సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తామని తెలిపారు. ‘రాజకీయ కారణాలతో జడ్జి ఇదంతా చేస్తున్నారని మీరు అనుకోవద్దు’అంటూ ట్రంప్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి : మిస్ యు హీరో సిద్ధార్థ్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments