Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడు తండ్రి కాదు.. ఓ కసాయి: పాప జుట్టును షాపింగ్ చేసే ట్రాలీకి కట్టి రాక్షసానందం!

టెక్సాస్‌కు చెందిన ఓ కసాయి తండ్రి కన్నబిడ్డను చిత్రహింసలకు గురిచేసి రాక్షసానందం పొందాడు. ఆ దుర్మార్గుడి చేష్టలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళతో వాగ్వివాదానికి కూడా దిగాడు. దీంతో చిర్రెత్తుకొచ్చి

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (09:33 IST)
టెక్సాస్‌కు చెందిన ఓ కసాయి తండ్రి కన్నబిడ్డను చిత్రహింసలకు గురిచేసి రాక్షసానందం పొందాడు. ఆ దుర్మార్గుడి చేష్టలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళతో వాగ్వివాదానికి కూడా దిగాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మహిళ... అతడి చేష్టలను ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో అప్ చేసి... ఇలాంటి నీచుడికి ఎలాంటి శిక్ష విధించాలంటూ కామెంట్ పెట్టింది. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ముద్దుగా బొద్దుగా ఉన్న ఆ పాప అల్లరి చేష్టలను చూసి ఆనందించాల్సిన ఆ తండ్రి... ఆ చిన్నారికి నరకం చూపించాడు. నిండా పదేళ్లు కూడా నిండని ఆ పాప జుట్టును షాపింగ్ చేసే ట్రాలీకి, తన చేతికి మధ్య ఉంచి ఈడ్చుకుపోయాడు. 'నాన్నా వద్దు నాన్నా.. నొప్పి లేస్తుంది.. ఆగు నాన్నా.. ఇంకెప్పుడూ నీకు నచ్చని పని చేయను. నీ మాటే వింటాను. ప్లీజ్ నాన్నా..' అంటూ తండ్రిని ప్రాధేయపడినా ఆ కసాయి తండ్రి వినిపించుకోలేదు. పైగా.. షాపింగ్ చేస్తున్నంతసేపూ ఆ మార్ట్‌లో తిప్పుతూ రాక్షసానందం పొందాడు. 
 
టెక్సాస్‌లోని క్లెవెరాండ్ స్టోర్‌లో జరిగిన దారుణమింది. సోమవారం షాపింగ్‌కు వచ్చిన ఆ వ్యక్తి తన కూతురిని దారుణంగా హింసిస్తుండటంతో ఆ షాప్‌లో పనిచేసే ఎరికా బర్చ్ అనే మహిళ అడ్డుకుంది. దీంతో ఆమెతో అతడు వాగ్వివాదానికి దిగాడు. మీ పరిధిలో మీరు ఉండండి.. నా కూతురు నా ఇష్టం.. అంటూ హెచ్చరించాడు. దీంతో అతడు చేస్తున్న దారుణాన్ని ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఈ విషయం కాస్త పిల్లల సంక్షేమ శాఖకు చేరింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ కసాయి తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments