Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్‌నెస్ పైశాచికత్వం: 6 ఏళ్ల కొడుకుని ట్రెడ్‌మిల్ పైన పరుగెత్తించిన తండ్రి, మరణించిన బాలుడు- video

ఐవీఆర్
గురువారం, 2 మే 2024 (23:13 IST)
ఫిట్‌నెస్ వుండాలి. కానీ అది పైశాచికత్వంలా మారకూడదు. కన్నతండ్రి తన కొడుకు లావుగా వున్నాడని ట్రెడ్ మిల్ పైన పరుగెత్తించి పరుగెత్తించి చనిపోయేవరకూ వదిలిపెట్టలేదు. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఈ విషాదకర ఘటన తాలూకు వీడియో చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. వాస్తవానికి ఆ పిల్లవాడు అసలు బొద్దుగానే లేడు. ఐనా తండ్రి పైశాచికానికి ప్రాణాలు కోల్పోయాడు.
 
న్యూజెర్సీ తండ్రి తన ఆరేళ్ల కొడుకు "చాలా లావుగా ఉన్నాడు" అని భావించి ట్రెడ్‌మిల్‌పై ఎలా పరుగెత్తేలా చేసాడో కలవరపరిచే వీడియో బయటకు వచ్చింది. ఈ హృదయ విదారక వీడియోలో వీడియో ప్లే అవుతుండగా పిల్లవాడి తల్లి కోర్టులో కన్నీరుమున్నీరైంది. చివరకు బాలుడు చనిపోయాడు.
 
బాలుడి తల్లి, బ్రె మిక్కియోలో, పిల్లవాడు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తన కొడుకు గాయాలను న్యూజెర్సీ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ పర్మనెన్స్ విభాగానికి నివేదించారు, ఏప్రిల్ 1న మిక్కియోలోను వైద్యుడి వద్దకు తీసుకెళ్లమని ఆమె గ్రెగర్‌ను కోరింది. "అతను లావుగా ఉన్నందున" తన తండ్రి తనను పరిగెత్తించాడని అపాయింట్‌మెంట్ సమయంలో పిల్లవాడు వెల్లడించాడు.
 
ట్రెడ్ మిల్ పైన బాలుడు పరుగెత్తిన సమయంలో తండ్రి దాని వేగాన్ని పెంచి అతడి పైశాచికత్వాన్ని బయటపెట్టాడు. ఆ వేగాన్ని తట్టుకోలేని చిన్నారి పలుమార్లు కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి గుండెకి, కాలేయానికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఫలితంగా అతడు మరణించాడు. తండ్రి చేసిన దారుణానికి కుమారుడు బలయ్యాడు. కేసు విచారించిన కోర్టు బాలుడి తండ్రికి జైలు శిక్ష విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments