Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపారిని హతమార్చారు.. ఫ్లాట్‌లోనే ముక్కలు ముక్కలుగా నరికేశారు..

Webdunia
గురువారం, 16 జులై 2020 (17:10 IST)
అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో వ్యాపారి ఫాహిమ్ దారుణ హత్యకు గురయ్యాడు. అతని ఫ్లాట్‌లోనే అతనిని హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ మూలాలున్న దంపతులకు సౌదీ అరేబియాలో జన్మించిన ఫాహిమ్, న్యూయార్క్‌లోనే పెరిగాడు. మూడు పదుల వయసులో 'పథావ్' అనే స్టార్టప్‌ను స్థాపించి బంగ్లాదేశ్‌లో రవాణా, ఫుడ్ డెలీవరి, చెల్లింపుల రంగాల్లో సేవలనందిస్తున్నాడు. 
 
ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్ విలువ 100 మిలియన్ డాలర్లుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఫాహిమ్ ఆయన ఫ్లాటులోనే ముక్కలు ముక్కలుగా నరకబడ్డాడు. ఫాహిమ్ సోదరి అక్కడికి వచ్చే సరికి ఆయన మృతదేహం రక్తపు మడుగులో పడివుంది. హత్య జరిగిన తీరును చూసిన పోలీసులు... ఈ ఘాతుకానికి బాధ్యులు కిరాయి హంతకులని భావిస్తున్నారు. 
 
అంతేకాదు... మృతుని సోదరి ఫాహిమ్ ఫ్లాట్‌కు వచ్చే సమయంలో కూడా నిందితుడు ఘటనాస్థలిలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమె రాకతో అలికిడి కావడంతో దుండగుడు... ఫ్లాట్ నుంచి తప్పించుకుని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాలో సైతం ఓ వ్యక్తి ఫాహిమ్ వెనుకనే వచ్చినట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments