Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్ట్ ట్రంప్ నివాసంలో ఎఫ్.బి.ఐ సోదాలు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (11:26 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నివాసంలో ఆ దేశ అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ ఎఫ్.బి.ఐ సోదాలు నిర్వహించింది. సోమవారం అర్థరాత్రి (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున) ఈ సోదాలు జరిగాయి. 
 
ట్రంప్‌కు చెందిన విలాసవంతమైన ఫామ్ హౌస్, రిసార్ట్ మార్-ఎ-లిగోలో సోదాలు నిర్వహించింది. దర్యాప్తు ఏజెన్సీ ఏజెంట్లు ట్రంప్ ఇంటిని చుట్టుముట్టగా తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ సోదాలపై ఎఫ్‌బీఐ దీనిపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. 
 
మరోవైపు, ఈ సోదాలపై డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. మార్-ఎ-లెగోలోని పామ్ బీచ్‌లోని తన అందమైన నివాసాన్ని ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుందన్న ట్రంప్‌.. ఇందుకు కారణాలు మాత్రం తెలుపలేదు. దీనిపై, ఎఫ్‌బీఐ ప్రతినిధిని సంప్రదించగా.. సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
 
అయితే, ఎఫ్‌బీఐ చర్య రాజకీయ ప్రతీకారమేనని ట్రంప్‌ ఆరోపించారు. మాజీ అధ్యక్షుడి ఇంటిపై దర్యాప్తు సంస్థ దాడి చేయడం అమెరికాకు ఇది గడ్డు కాలమని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇంతకు ముందు ఏ మాజీ అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments