Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు మహేష్ బాబు బర్త్‌డే - 'పోకిరి'గా మరోమారు ముందుకు

Advertiesment
mahesh babu
, మంగళవారం, 9 ఆగస్టు 2022 (10:34 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఇందుకోసం ఆయన అభిమానాలు ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే, మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని సినీ సెలెబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. 
 
గత 1975 ఆగస్టు 9వ తేదీన చెన్నైలో జన్మించిన మహేష్ బాబు ఇపుడు తెలుగు చిత్రపరిశ్రమను ఏలేస్తున్నాడు. ఈయన తన అన్న రమేష్ బాబుతో కలిసి "నీడ" అనే చిత్రంలో తొలిసారి వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత బాలనటుడుగా తండ్రితో కలిసి పలు చిత్రాలు నటించి నటనలోని మళకువల్ని ఆ వయసులోనే ఒడిసిపట్టాడు. 
 
ఆ తర్వాత బాలనటుడుగా తన తండ్రితో కలిసి అనేక చిత్రాల్లో నటించారు. కొడుకు దిద్దిన కాపురం, గూఢచారి 117, శంఖారావం, బాలచంద్రుడు, అన్నతమ్ముడు, ముగ్గురు కొడుకులు లాంటి చిత్రాల్లో నటించి అభిమానుల్ని మెప్పించాడు. అతడి చదువు పాడవకూడదనే ఉద్దేశంతో కొంతకాలం మహేశ్ బాబును కెమెరాకు దూరంగా ఉంచారు. 
 
1999లో ‘రాజకుమారుడు’ చిత్రంతో మహేశ్ బాబు హీరోగా సినీరంగ ప్రవేశం చేశాడు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కైవసం చేసుకున్నాడు. మహేశ్ కెరీర్‌ను అద్భుతమైన మలుపు తిప్పిన చిత్రం ‘మురారి’. అందులోని వైవిధ్యమైన అతడి నటనకు అభిమానులు మురిసిపోయారు. 
 
ఇక అతడికి యాక్షన్ హీరోగా మంచి బ్రేక్‌నిచ్చిన చిత్రం ‘ఒక్కడు’. ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి.. తిరుగులేని స్టార్ అయ్యాడు. కొన్ని విషయాల్లో తండ్రిని అనుసరించిన మహేశ్.. మరికొన్ని చోట్ల తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు.  
 
‘నిజం’ చిత్రంతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్న మహేశ్ బాబు.. ఆ తర్వాత ‘అతడు, దూకుడు, శ్రీమంతుడు’ చిత్రాలకుగాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి చిత్రాలు సిల్వర్ జూబిలీ జరుపుకున్నాయి. ‘శ్రీమంతుడు’ రజతోత్సవం చేసుకుంది. 
 
జీఎంబీ పేరుతో సొంతంగా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై నిర్మితమైన ‘శ్రీమంతుడు’ చిత్రం సూపర్ హిట్టయింది. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వురు, సర్కారువారి పాట’ లాంటి సినిమాలతోనూ నిర్మాణ భాగస్వామి అయ్యాడు. అడివి శేష్ హీరోగా మేజర్  నిర్మించగా అది అద్భుతమైన రీతిలో ప్రేక్షకాదరణను పొందింది. 
 
ఇక మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న ప్రపంచ వ్యాప్తంగా 175 స్క్రీన్స్‌లో 4K ఫార్మేట్ లో ‘పోకిరి’ చిత్రం మరోసారి అభిమానుల ముందుకొచ్చింది. దీనికి అద్భుతమైన స్పందన లభించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంబర్ వన్ స్థానాన్ని ప్రేక్షకులే ఇవ్వాలి : అదితి శంకర్