Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ కాశ్మీర్‌ శాంతిని కోరుకోవట్లేదు.. యోగి యోగ్యత ఏమిటి?: ముషారఫ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆకాశానికెత్తేశారు. భారత్‌లో అధికారంలో ఉన్నది మతతత్వ పార్టీ అని.. మోడీ నాయకత్వంలో భారత్ పురోగతి సాధిస్తుందని తెలిపారు. కానీ మోడీ

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (16:01 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆకాశానికెత్తేశారు. భారత్‌లో అధికారంలో ఉన్నది మతతత్వ పార్టీ అని.. మోడీ నాయకత్వంలో భారత్ పురోగతి సాధిస్తుందని తెలిపారు.

కానీ మోడీ కాశ్మీర్ విషయంలో శాంతిని కోరుకోవట్లేదని, అది పెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌ ప్రధానిగా మోడీ చాలా చురుగ్గా పనిచేస్తున్నారని, కాశ్మీర్ విషయంలో మాత్రం ఆయన తీరు శాంతిని కోరుకునేట్లు లేదన్నారు. 
 
ఇక ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌పై ముషారఫ్ ఫైర్ అయ్యారు. యోగి యోగ్యత ఏమిటి? భారత్‌లో లౌకిక విశ్వాసాలు క్షీణిస్తున్నాయి. భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్.. పురోగమించిన.. వివేకం కలిగిన సమాజం అంటూ ముష్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి తాము మద్దతు ఇస్తామని ముషారఫ్ పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాను కాశ్మీర్‌ వేర్పాటువాదులు తెగ వాడుకుంటున్నారు. కశ్మీర్‌లోని యువతను రెచ్చగొట్టి దాడులు చేయించేందుకుగాను సోషల్ మీడియాను వేర్పాటు వాదులు యధేచ్ఛగా వాడుకుంటున్నారు. బలగాలపైకి రాళ్లు విసురుతున్న ఆందోళనకారులు సుమారు 300 వాట్సప్‌ గ్రూపుల ద్వారా తమను తాము నియంత్రించుకుంటున్నారు. 
 
ఈ విష‌యంపై స‌మాచారం అందుకున్న సెక్యూరిటీ ఫోర్సెస్ అందులో ఇప్ప‌టికే 90 శాతం వరకు వాట్సాప్‌ గ్రూపులు బ్లాక్ చేశారు. ప్రతి వాట్సప్‌ గ్రూపులో 250 మంది ఉన్నారు. వారంతా త‌మ ప్రాంతంలోని భ‌ద్ర‌తా బలగాల కదలికల గురించి వాట్సప్‌ గ్రూపుల ద్వారా అందరికీ స‌మాచారం అందిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments