Webdunia - Bharat's app for daily news and videos

Install App

Elon Musk: అమెరికా సర్కారులోని DOGE ఛైర్మన్ పదవికి ఎలెన్ మస్క్ రాజీనామా

సెల్వి
గురువారం, 29 మే 2025 (10:38 IST)
టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలోన్ మస్క్ అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ సంచలనాత్మక ప్రకటన చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ ద్వారా ఈ ప్రకటన చేశారు. 
 
అమెరికా పరిపాలనలో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన పదవీకాలం ముగిసిందని ఎలోన్ మస్క్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అనవసరమైన ప్రభుత్వ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఒక ప్రధాన కార్యక్రమానికి దోహదపడే అవకాశాన్ని ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 
 
భవిష్యత్తులో DOGE విభాగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, దాని లక్ష్యాలను సాధిస్తుందని మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు రెండవసారి స్వీకరించిన తర్వాత, ప్రభుత్వ కార్యకలాపాలలో విస్తృత సంస్కరణలను అమలు చేయడం, సమాఖ్య సంస్థలలో వృధా ఖర్చులను అరికట్టడం అనే ముఖ్య లక్ష్యాలతో ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE) స్థాపించబడింది. 
 
కొత్తగా ఏర్పడిన ఈ విభాగానికి ఎలోన్ మస్క్ చైర్మన్‌గా నియమితులయ్యారు. మస్క్ నాయకత్వంలో, DOGE ప్రభుత్వ వ్యయ నియంత్రణపై దృష్టి సారించిన అనేక చర్యలను ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments