Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కుబేరుడుగా మళ్లీ ఎలాన్ మస్క్!

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (14:00 IST)
ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ ఎలాన్ మస్క్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఆస్థానంలో ఉన్న ఎల్.వీ.ఎం.హెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్స్ సంపద 2.6 శాతం మేరకు తగ్గిపోవడంతో టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది.
 
గత డిసెంబరులో ఆర్నాల్ట్స్ తొలిసారి మస్క్‌ను దాటేసి మొదటిస్థానానికి చేరుకున్నారు. టెక్‌ ఇండస్ట్రీ భారీ ఒడుదొడుకులు ఎదుర్కోవడం, ట్విటర్‌ కొనుగోలు తర్వాత పరిణామాల నేపథ్యంలో టెస్లా షేరు విలువ అప్పట్లో భారీగా పతనమైంది. దీంతో మస్క్‌ వ్యక్తిగత సంపద తరిగిపోయింది. 
 
అదేసమయంలో కరోనా పరిస్థితులు చక్కబడడంతో విలాసవంత వస్తువుల కొనుగోళ్లు పుంజుకొన్నాయి. ఫలితంగా ఎల్‌వీఎంహెచ్‌ షేర్లు రాణించాయి. తిరిగి ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు బలపడడంతో మళ్లీ లగ్జరీ వస్తువుల తయారీ సంస్థల షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి.
 
విలాసవంత వస్తువులకు పెట్టింది పేరైన ఎల్‌వీఎంహెచ్‌ షేర్లు ఏప్రిల్‌ నుంచి 10 శాతానికి పైగా పడిపోయాయి. ఓ దశలో ఒక్కరోజులోనే ఆర్నాల్ట్స్ సంపదలో 11 బిలియన్‌ డాలర్లు ఆవిరయ్యాయి. మస్క్‌ సంపద మాత్రం ఈ ఏటా పెరుగుతూ పోతోంది. ట్విటర్‌ కొనుగోలు పరిణామాల నేపథ్యంలో కుంగిన టెస్లా షేర్లు కనిష్ఠాల నుంచి పుంజుకోవడమే ఇందుకు కారణం. 
 
మస్క్‌ వ్యక్తిగత సంపదలో 71 శాతం వాటా టెస్లా షేర్లదే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెస్లా షేర్లు 66 శాతం పుంజుకున్నాయి. దీంతో మస్క్‌ సంపద 55.3 బిలియన్‌ డాలర్లు పెరిగి ప్రస్తుతం 192.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అదేసమయంలో ఆర్నాల్ట్స్ సంపద రూ.186.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments