Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై మూడు మందుల కాంబినేషన్ ప్రభావం!

Webdunia
శనివారం, 9 మే 2020 (21:54 IST)
అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ను రూపుమాపేందుకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వేల కోట్ల వ్యయంతో ప్రయోగశాలల్లో వ్యాక్సిన్లు, సమర్థ ఔషధాల కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికర అంశం వెల్లడించారు. మూడు రకాల మందుల కాంబినేషన్ ను కరోనా చికిత్సలో వాడితే, సత్ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
 
యాంటీ వైరల్ థెరపీలో భాగంగా కరోనా రోగులకు ఇంటర్ ఫెరాన్ బీటా-1బీతో పాటు లోపినవివర్-రిటోనవిర్, రైబావిరిన్ ఔషధాలను రెండు వారాల పాటు ఇచ్చినట్టయితే శరీరంలో వైరస్ ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టు పరిశోధకులు తెలిపారు. కేవలం లోపినవిర్-రిటోనవిర్ మాత్రమే ఇచ్చినప్పుడు ఏమంత సమర్థంగా పనిచేయలేదని, ఇతర యాంటీ వైరల్ మందులు కూడా జతచేసినప్పుడు ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయని హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన ఆ పరిశోధకులు వివరించారు.
 
సింగిల్ డ్రగ్ ట్రీట్ మెంట్ కంటే కాంబినేషన్ లో యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా అధిక ప్రభావం కనిపిస్తోందని, అయితే, రోగులు కరోనా లక్షణాలు కనిపించిన వారంలోపే ఆసుపత్రిలో చేరినప్పుడే ఈ ట్రిపుల్ కాంబినేషన్ మందులు శక్తిమంతంగా పనిచేస్తాయని తెలిపారు.

ఈ మూడు మందుల వాడకంతో రోగులు ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం కూడా తగ్గుతుందని, వారిలో వైరల్ లోడ్ కొన్నిరోజుల్లోనే కనిష్ట స్థాయికి చేరుతుందని హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన క్వోక్ యుంగ్ యువెన్ వెల్లడించారు. ఈ విధమైన ట్రిపుల్ డ్రగ్ కాంబినేషన్ ను రోగులు బాగానే తట్టుకుంటారని, ఇది సురక్షితమైన వైద్య విధానం అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments