Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూన్ దుబాయ్.. సరికొత్త ప్రపంచం.. 10 ఎకరాల విస్తీర్ణంలో రిసార్ట్

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (12:56 IST)
Moon
భవిష్యత్తులో దుబాయ్‌ని అత్యంత ఆకర్షణీయ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా దుబాయ్ మీనా ప్రాంతంలో మూన్ దుబాయ్ పేరిట సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. 
 
ఇది అచ్చం చంద్రుడి ఉపరితలంపై ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. పర్యాటకులకే కాదు, అంతరిక్ష పరిశోధన సంస్థలు కూడా ఇక్కడ తమ వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు అనువుగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. 
 
ఈ మూన్ ప్రాజెక్టు వల్ల వార్షిక పర్యాటకుల సంఖ్య రెట్టింపవుతుందని మాథ్యూస్ అండ్ హెండర్సన్ మూన్ వరల్డ్ రిసార్ట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ మూన్ రిసార్ట్‌ను 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 
 
స్పేస్ టూరిజంపై ఆసక్తి ఉన్నవారికి, ఖర్చు భరించగలిగిన వారికి ఇక్కడి లూనార్ కాలనీ అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. చంద్రుడిపై ఎలా ఉంటుందో, అలాంటి వాతావరణాన్నే ఇక్కడ సృష్టించనున్నారు. 
 
దాంతోపాటే ఇక్కడ 300 ప్రైవేటు నివాస గృహాలు కూడా ఉంటాయట. కొద్దిపాటి స్థలంలోనే అధిక సంఖ్యలో గృహాల నిర్మాణం కోసం స్కై విల్లాస్ పేరిట డిస్క్ ఆకారంలో భవన నిర్మాణం చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments