Webdunia - Bharat's app for daily news and videos

Install App

నౌకలో సామర్థ్యానికి మించి జనం.. స్మగ్లర్లు ఏం చేశారంటే?

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (15:53 IST)
Boat
నౌకలో వలస వెళ్తున్న వారిని కొందరు స్మగ్లర్లు పొట్టనబెట్టుకున్నారు. నౌక సామర్థ్యానికి మించి అందులో ప్రయాణిస్తున్నారు. ఆ విధంగా ప్రయాణిస్తే.. వారితో పాటు తాము మునిగిపోతామని బావించిన స్మగ్లర్లు దారుణానికి ఒడిగట్టారు. 
 
వలస కార్మికుల్లో 80 మందిని నౌక నుంచి సముద్రంలోకి తోసేసారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ దారుణ ఘటన తూర్పు ఆఫ్రికాలోని డిజిబౌటి ప్రాంతంలో చోటు చేసుకుంది.
 
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) వివరాల మేరకు.. తూర్పు ఆఫ్రికాలోని డిజిబౌటి నుంచి యెమెన్‌కు దాదాపు 200 మంది ఓ నౌకలో బుధవారం తెల్లవారుజామున బయలుదేరారు. వీరిలో దొంగతనంగా సరుకు రవాణా చేసే స్మగ్లర్లు కూడా ఉన్నారు. 
 
అయితే.. నౌక సామర్థ్యానికి మించి ఎక్కువ మంది నౌకలో ఉండడంతో కొంత దూరం వెళ్లిన తరువాత స్మగ్లర్లు 80 మంది వలసదారులను సముద్రంలోకి తోసేశారు. వీరిలో 20మంది ప్రాణాలు కోల్పోయారు.
 
60మంది సముద్రాన్ని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. 20 మందిలో ఐదు మృతదేహాలను మాత్రమే ఇప్పటి వరకు వెలికితీయగా.. మిగతా వాటి కోసం గాలిస్తున్నారు. సముద్రాన్ని ఈదుకుంటూ ప్రాణాలతో బయట పడిన 60 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments