Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020 రెండోసారి రేసుకు రెడీనా.. ట్రంప్‌ సవాల్.. ధీటుగా స్పందించిన హిల్లరీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించిన ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హిల్లరీ క్లింటన్ ఈ మధ్య విమర్శలు గుప్పిస్తోంది. ఇందుకు ట్రంప్ కూడా ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు. 2020లో తనతో అ

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (11:58 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించిన ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హిల్లరీ క్లింటన్ ఈ మధ్య విమర్శలు గుప్పిస్తోంది. ఇందుకు ట్రంప్ కూడా ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు. 2020లో తనతో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ సవాలుకు హిల్లరీ క్లింటన్ ధీటుగా సమాధానమిచ్చింది. 
 
డెమొక్రాట్ల తరపున ట్రంప్‌తో పోటీపడి ఓటమి పాలైన హిల్లరీ క్లింటన్.. మరోసారి వైట్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు తాను ప్రయత్నించబోనని ఇప్పటికే కుండబద్ధలు కొట్టినట్లు తెలిపిన నేపథ్యంలో.. ట్రంప్ రెండో విడత అవకాశాన్ని తాను అడ్డుకునేది లేదన్నారు. అందుకే డెమొక్రాట్ల తరఫున ఎవరు నిలబడ్డా పూర్తి మద్దతు ఇస్తానని నొక్కి చెప్పారు. 
 
కాగా అమెరికాలో జాత్యహంకారం పెరుగుతోందని హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించడాన్ని గుర్తుచేస్తూ.. అలాంటి మాటలే 2016లో హిల్లరీని ఓడించాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. హిల్లరీ ఓడిపోవడానికి ఎన్నో కారణాలున్నాయని, మెజారిటీ అమెరికన్లపై ఆమె అభాండాలు మోపారని ట్రంప్ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments