Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్ముడు పోలేదు.. అభివృద్ధి కోసమే సైకిలెక్కుతున్నా : బుట్టా రేణుక

వైకాపాకు చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైపోయింది. తెదేపాలో చేరే విషయంపై ఇంతకాలం దాగుడుమూతలాడుతూ వచ్చిన బుట్టా రేణుక... తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని తేలడంతో ఆమెపై వై

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (11:46 IST)
వైకాపాకు చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైపోయింది. తెదేపాలో చేరే విషయంపై ఇంతకాలం దాగుడుమూతలాడుతూ వచ్చిన బుట్టా రేణుక... తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని తేలడంతో ఆమెపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సస్పెన్ష్ వేటు వేసి విషయం తెల్సిందే. 
 
దీంతో ఆమె మంగళవారం విజయవాడకు చేరుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై అధికారికంగా పసుపుజెండా కప్పుకోనున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రేణుక భర్త ఇప్పటికే టీడీపీలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. 
 
కాగా, పార్టీ మార్పుపై ఆమె స్పందిస్తూ.. అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నానని, కర్నూల్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటుచేసి లాంఛనంగా పార్టీలో చేరుతానని చెప్పారు. టీడీపీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్న బట్టారేణుక, మంగళవారం ఉదయం అనుచరులతో కలిసి విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. 
 
ఆయనతో కాసేపు చర్చించిన ఆమె, అనంతరం తన చేరిక గురించి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.., అభివృద్ధి కోసమే టీడీపీకి మద్ధతునిచ్చానని, అభివృద్ధిని కోరుకునే వారంతా టీడీపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక రేణుకతో పాటు ఆమె అనుచరులకు కూడా కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments