Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్లామిక్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. ట్రంప్ కఠిన చర్యలు ఆ ఆర్డర్‌పై సంతకం..

ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. అమెరికాలోని శరణార్థుల పునరావా

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (11:13 IST)
ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. సిరియా వలసదారుల్లో క్రిస్టియన్లకు ప్రాధాన్యమివ్వనున్నారు. అమెరికాకు మద్దతిచ్చే వారు, అమెరికన్లపై అభిమానం ఉన్న వారే ఇక్కడి రావాలని కోరుకుంటున్నామని ట్రంప్‌ పేర్కోన్నారు. 
 
ముస్లిం మెజార్టీ దేశాల నుంచి వలసలు తగ్గించేందుకు అక్కడి నుంచి వచ్చే వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించే విధంగా నిబంధనలు రూపొందించే ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వారం రోజుల అనంతరం తొలిసారి పెంటగావ్‌కు వెళ్లిన ట్రంప్‌ దీనిపై సంతకం చేశారు. 
 
'ఇస్లామిక్‌ ఉగ్రవాదులను అమెరికా బయటే ఉంచేందుకు అత్యంత క్లిష్టమైన నిబంధనలు తీసుకువస్తున్నా. ఉగ్రవాదులు ఇక్కడ ఉండాలని మేము అనుకోవట్లేదు' అని ట్రంప్‌ ఆర్డర్‌పై సంతకం చేసిన అనంతరం తెలిపారు. అయితే ట్రంప్‌ ఈ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేయడాన్ని హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదని హెచ్చరిస్తున్నారు. ఈ ఆర్డర్‌ ప్రకారం వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్‌, సిరియా, ఇరాన్‌, సూడాన్‌, లిబియా, సోమాలియా, యెమెన్‌ దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments