Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం పన్నీర్ సెల్వం కాన్వాయ్‌కి దారిచ్చిన స్టాలిన్.. సోషల్ మీడియాలో ప్రశంసలు..

తమిళనాట రాజకీయాల్లో మార్పు చోటుచేసుకుంది. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకే- డీఎంకే పార్టీల మధ్య హుందా రాజకీయాలు జరుగుతున్నాయి. తాజాగా శాసనసభకు వెళుతున్న ప్రతిపక్షనేత స్టాలిన్‌ తన కారు వెనుక సీఎం కాన్వాయ్‌

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (11:00 IST)
తమిళనాట రాజకీయాల్లో మార్పు చోటుచేసుకుంది. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకే- డీఎంకే పార్టీల మధ్య హుందా రాజకీయాలు జరుగుతున్నాయి. తాజాగా శాసనసభకు వెళుతున్న ప్రతిపక్షనేత స్టాలిన్‌ తన కారు వెనుక సీఎం కాన్వాయ్‌ రావటాన్ని గుర్తించి దారి ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం తన నివాసం నుంచి కారులో ప్రతిపక్షనేత స్టాలిన్‌ బయలుదేరారు. ఆయన కారు వెంట సీఆర్‌పీఎఫ్‌ భద్రతా సిబ్బంది, శాసనసభ్యుల వాహనాలు కూడా వస్తున్నాయి. 
 
ఆ సమయంలో ఆళ్వారుపేట దాటిన తర్వాత ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం కాన్వాయ్‌ రావటాన్ని స్టాలిన్‌ గుర్తించారు. వెంటనే తన వాహనాన్ని రోడ్డు పక్కన నిలపాల్సిందిగా డ్రైవరుకు సూచించారు. అలాగే భద్రతా సిబ్బంది, శాసనసభ్యులకు ఆ విషయాన్ని చేరవేశారు. దీంతో క్షణాల్లో వారి కార్లన్నీ రోడ్డు పక్కకు చేరుకుని నిలిచిపోయాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌ ఆ రోడ్డుపై వేగంగా దూసుకెళ్లిపోయింది.
 
ఆ తర్వాత స్టాలిన్‌, శాసనసభ్యుల కార్లు అక్కడి నుంచి ముందుకు కదిలాయి. ప్రతిపక్షనేతగా క్యాబినెట్‌ మంత్రి హోదాలో ఉన్న స్టాలిన్‌ ఇలా ముఖ్యమంత్రిని గౌరవిస్తూ ఆయన కాన్వాయ్‌కు దారిచ్చిన వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో విస్తరించడంతో పాటు పలువురు మన్ననలు అందుకుంటోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

Pushpa-2 కొత్త రికార్డ్-32 రోజుల్లో రూ.1,831 కోట్ల వసూలు.. బాహుబలి-2ను దాటేసింది..

Nayanthara: మళ్లీ వివాదంలో చిక్కుకున్న నయనతార.. ధనుష్ బాటలో చంద్రముఖి?

Honey Rose: హనీ రోజ్‌ను వేధించిన ఆ ధనవంతుడు ఎవరు?

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments