Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేస్తే వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోతా : డోనాల్ ట్రంప్

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (11:36 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ప్రస్తుత అధినేత డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు దిగివస్తున్నారు. ఎన్నికల ఫలితాలను నిరాకరించడంతో పాటు పోలింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇపుడు ఆయన తన భీష్మ ప్రతిజ్ఞ నుంచి ఒక్కో మెట్టు దిగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ ప్రకటన చేశారు. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ను విజేతగా ఎలక్టోరల్‌ కాలేజీ అధికారికంగా ధ్రువీకరిస్తే తాను వైట్‌హౌస్‌ నుంచి తప్పుకొని వెళ్లిపోతానని ట్రంప్ ప్రకటించారు. నవంబర్ 3 ఓట్ల తర్వాత విలేకరుల మొదటి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ట్రంప్‌.. జనవరి 20న బిడెన్‌ను పాలనకు ముందు కాలానికి మాత్రమే సేవ చేస్తానని అంగీకరించారు. 
 
‘బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరిస్తే వైట్‌హౌస్‌ నుంచి వెళ్లిపోతారా?’ అని ప్రశ్నించగా.. ట్రంప్‌ ‘తప్పకుండా చేస్తాను.. ఆ విషయం నీకు తెలుసా?’ అన్నారు. కానీ, అలా చేసినట్లయితే వారు తప్పు చేసినట్లే.. అంగీకరించడానికి చాలా కష్టం’ అన్నారు. ‘ప్రస్తుతం (జనవరి) 20వ తేదీ మధ్య చాలా విషయాలు జరగవచ్చని నేను భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 
 
కాగా, ఈ నెల 3వ తేదీన వెల్లడైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. బైడెన్‌కు 306 ఎలక్టోరల్ ఓట్లు రాగా, డోనాల్డ్ ట్రంప్‌కు 232 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ అధికార పగ్గాలను వీడేందుకు ఆయన ససేమిరా అంటున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments