Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్‌కు కొరియా రాదు.. కిమ్‌కు ఇంగ్లీష్ రాదు.. మరి ఎలా?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌లు మంగళవారం సింగపూర్ వేదికగా చారిత్మాక భేటీ నిర్వహించారు. సింగపూర్‌లోని ఓ నక్షత్ర రిసార్ట్స్‌లో వీరిద్దరూ భారత కాలమానం ప్రకారం ఉద

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (09:59 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌లు మంగళవారం సింగపూర్ వేదికగా చారిత్మాక భేటీ నిర్వహించారు. సింగపూర్‌లోని ఓ నక్షత్ర రిసార్ట్స్‌లో వీరిద్దరూ భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటలకు సమావేశమయ్యారు.
 
అయితే, డోనాల్డ్ ట్రంప్‌కు కొరియా భాష రాదు.. అలాగే, కిమ్ జాంగ్ ఉన్‌కు ఇంగ్లీషు రాదు. మరి వీరిద్దరూ ఎలా మాట్లాడుకున్నారనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. దీనిపై ఓ క్లారిటీ కూడా ఇచ్చాయి ఇరు దేశాలు. 
 
ఇరు దేశాధినేతల మాటలను ఆయా భాషల్లోకి తర్జుమా చేసేందుకు దుబాసీలను (అనువాదకులు)ను ఇరు దేశాలు ముందుగానే నియమించుకున్నాయి. ఇంగ్లీషు - కొరియా భాషలపై మంచిపట్టున్న అనువాదకులను ఇరు దేశాధినేతతో పాటు శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. 
 
దీంతో ఇక ఒకరు మాట్లాడిన మాటలు మరొకరికి అనువదించారు. ఇంగ్లీష్, కొరియన్ భాషలు తెలిసిన అనువాదకులు కిమ్, ట్రంప్ మాట్లాడిన మాటలు ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించి చెప్పారు. 'ఈ సమావేశం ఫలప్రదం కావాలని భావిస్తున్నా' అన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కిమ్, అసలు ఇంతవరకూ రావడమే చాలా గొప్ప విషయమని, ఎన్నో అడ్డంకులను అధిగమించిన తర్వాత ఈ రోజు వచ్చిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments