జూన్ 12న కింగ్ - ట్రంప్ భేటీ : మైక్ పాంపియో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య చారిత్రక భేటీ వచ్చే నెల 12వ తేదీన జరుగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. అనుకున్న తేదీన భేటీ జరుగకపో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య చారిత్రక భేటీ వచ్చే నెల 12వ తేదీన జరుగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. అనుకున్న తేదీన భేటీ జరుగకపోవచ్చునని ట్రంప్ ప్రకటించిన మరుసటిరోజే పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు.
బుధవారం అమెరికన్ కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల కమిటీ ముందు హాజరైన పాంపియో.. అమెరికా జాతీయ భద్రతా ప్రాధాన్యతల్లో ఉత్తర కొరియా అణునిరాయుధీకరణ ఒకటని వెల్లడించారు. ఉత్తర కొరియాపై దౌత్యపరమైన, ఆర్థిక ఆంక్షల ఒత్తిళ్లు సానుకూల ఫలితాలను రాబడుతున్నాయని పాంపియో వివరించారు.