Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 26తో ఆ నిషేధాన్ని తొలగిస్తున్నా: ట్రంప్ అనూహ్య నిర్ణయం

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (11:44 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యాల సైతం భయంతో వణికిపోతున్నాయి. అమెరికాలో నిన్నటికి మొత్తం వచ్చిన కరోనా కేసుల సంఖ్య 24 మిలియన్లను దాటింది. అయినా సరే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ నిర్ణయం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
కొత్త కరోనా కారణంగా యూకేతో సహా పలు దేశాలపైన ప్రయాణాలకు సంబంధించి నిషేదం విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆఫీస్‌ను వదిలిన వారం రోజులకు అంటే జనవరి26తో ఆ నిషేదాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తొలగింపు కూడా కేవలం యూరప్‌లోని షెన్‌జెన్ జోన్‌లో ఉన్న 26 దేశాలకు మాత్రమే వర్తిస్తుంది. వాటిలో యూకే, బ్రెజిల్, ఐర్‌లాండ్‌లు కూడా ఉన్నాయి. అవి అమెరికా పాలసీలకు హానికరం కాదని అందుకే వాటిపై ప్రయాణ నిషేధాన్ని తొలగిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ ఆర్డర్ జనవరి 26 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ నిషేధం ఎత్తివేతపై అక్కడి ఆరోగ్య శాఖ వారు సుముఖం చూపడంలేదు.
 
'దేశ రాజ్యంగం, న్యాయ నియమాలు, అంతేకాకుండా సెక్షన్స్ 212ఎఫ్, 215ఏ, నేషనాలిటీ యాక్ట్ 8యూఎస్‌సీ ప్రకారం యెనైటెడ్ స్టేట్స్‌కు అధ్యక్షునిగా ఎన్నుకోబడిన డొనాల్డ్ జే ట్రంప్ అనే నేను యూరప్ షెన్‌జెన్ జోన్‌లోని దేశాలు అమెరికా పాలసీలకు ఏమాత్రం హానికరం కాదని, యునైటెడ్ కింగ్‌డమ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్‌ల్యాండ్‌లతో పాటుగా ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్‌లు అమెరికా ఆసక్తులకు ఏమాత్రం హానికరం కాదని అందుచేత అక్కడి నుంచి అమెరికాకు జరగనున్న అన్ని ప్రయాణాలను మళ్లీ పునరుద్ధరించేందుకు సమ్మతిస్తున్నా'ని ట్రంప్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments