దీపావళి వేళ మహాత్ముడికి బ్రిటన్‌ ఘన నివాళి

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:32 IST)
మహాత్మాగాంధీని బ్రిటన్‌ ప్రభుత్వం గొప్పగా స్మరించుకుంది! దీపావళి పర్వదినం పురస్కరించుకుని బాపూజీ జీవితం, ఆశయాలను ప్రతిబింబిస్తూ.. కొత్తగా రూపొందించిన 5 పౌండ్ల స్మారక నాణెన్ని బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ గురువారం ఆవిష్కరించారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన ప్రభావవంతమైన నాయకుడికి ఇది ఘనమైన నివాళి అని సునక్ పేర్కొన్నారు. ‘దీపావళి సందర్భంగా ఈ నాణెన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ కీలకపాత్ర పోషించారు.

ఈ క్రమంలో మహాత్ముడి జీవితాన్ని స్మరించుకుంటూ మొదటిసారి బ్రిటన్‌ నాణెం రూపొందించడం అద్భుతంగా ఉంది’ అని వివరించారు. ఈ ఏడాది భారత్‌ ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌’ జరుపుకొంటున్న ప్రత్యేక సందర్భంలో.. ఈ స్మారక నాణెం ఇరు దేశాల మధ్య శాశ్వత సంబంధాలు, సాంస్కృతిక వారధికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.
 
రాయల్‌ మింట్‌ వెబ్‌సైట్‌ విక్రయాలు..
హీనా గ్లోవర్‌ అందించిన ఆకృతిలో రూపొందించిన ఈ స్మారక నాణెంలో భారత జాతీయ పుష్పం కమలం పువ్వుతోపాటు గాంధీ ప్రముఖ సూక్తుల్లో ఒకటైన ‘మై లైఫ్‌ ఇజ్‌ మై మెసేజ్‌’ను పొందుపరిచారు. బంగారం, వెండితోపాటు ఇతర రకాల్లోనూ ఇది అందుబాటులో ఉంది.

గురువారం నుంచి బ్రిటన్‌ రాయల్ మింట్ వెబ్‌సైట్‌లో వీటిని అమ్మకానికి పెట్టారు. 20వ శతాబ్దపు గొప్ప వ్యక్తుల్లో ఒకరైన మహాత్మాగాంధీని స్మారక నాణెంతో గౌరవించడం గర్వంగా ఉందని రాయల్ మింట్ ఈ సందర్భంగా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments