Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ గురించి బాహ్య ప్రపంచానికి చెప్పిన చైనా విలేఖరికి జైలుశిక్ష!

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (10:32 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుక చైనాలోని వుహాన్ నగరం. ఇక్కడ నుంచే ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఒక విధంగా చెప్పాలంటే వుహాన్‌లోని ఓ బయోలాజికల్ పరిశోధనాశాలలో ఈ వైరస్‌ను తయారు చేసినట్టు వార్తలు వచ్చాయి. పైగా, ఈ వైరస్ గురించి చైనా జర్నలిస్టులే ప్రపంచానికి తెలిపారు. 
 
అలాంటి విలేఖరులు చాలా మంది వుహాన్ నగరంలో కనిపించకుండా పోయారు. ఒక వేళ కనిపించినా వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి వెల్లడించిన విలేకరికి చైనా ప్రభుత్వం ఐదేళ్ళ జైలుశిక్ష విధించింది. ఈ విలేఖరి ఓ మాజీ న్యాయవాది కూడా. 37 ఏళ్ల ఝాంగ్‌ఝాన్ సిటిజన్ జర్నలిస్టుగా వుహాన్ నగరంలో పని చేస్తున్నారు. ఈమె వైరస్ వెలుగు చూసిన వుహాన్ వెళ్లి వైరస్‌కు సంబంధించి పలు కథనాలు రాసింది.
 
కరోనా వైరస్‌పై ప్రశ్నించిన పలు కుటుంబాలను పోలీసులు హింసించారని, కొందరు స్వతంత్ర విలేకరులు కనిపించకుండా పోయారంటూ తన కథనాల్లో పేర్కొంది. ఈ మేరకు చైనీస్ హ్యూమన్ రైట్ డిఫెండర్స్ (సీహెచ్ఆర్‌డీ) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. దీంతో ఆమె గొడవలకు దిగుతూ సమస్యలు సృష్టిస్తోందన్న ఆరోపణలతో మే నెలలో ఝాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మూడు నెలలకు న్యాయవాదిని కలిసేందుకు ఆమెకు అనుమతి లభించింది.
 
తన అరెస్టుకు నిరసనగా ఝాన్ జైలులో నిరాహార దీక్షకు దిగిందని, సెప్టెంబరు 18న ఆమెను దోషిగా నిర్ధారించినట్టు ఆమె తరపు న్యాయవాదికి ఫోన్ వచ్చింది. వీచాట్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో కొవిడ్‌పై తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసినట్టు రుజువు కావడంతో ఆమెకు శిక్ష విధించినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ నేరాలన్నింటికీ కలిపి ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని న్యాయస్థానం సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments