Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈస్టర్ డే పేలుళ్ళ కవరేజీకి వెళ్లిన భారతీయ జర్నలిస్టు... అరెస్టు చేసిన శ్రీలంక

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (13:08 IST)
శ్రీలంక రాజధాని కొలంబోలో గత ఏప్రిల్ నెల 21వ తేదీన ఈస్టర్ సండే రోజున వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో సుమారుగా 350 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుళ్ళను యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. అయితే, ఈ పేలుళ్ళను లైవ్ కవరేజ్ చేసేందుకు భారత్ నుంచి ఫోటో జర్నలిస్టు సిద్ధిఖీ అహ్మద్ డానిష్ కొలంబోకు వెళ్లాడు. ఆయన్ను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ముందస్తు అనుమతిలేకుండా ఓ స్కూల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినందునే ఆయనను అరెస్టు చేసినట్టు సమాచారం. నెగొంబో నగరంలోని ఓ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడేందుకు సిద్దిఖి బలవంతంగా లోపలికి వెళ్లబోయినట్టు శ్రీలంక స్థానిక మీడియా వెల్లడించింది. ఈస్టర్ రోజు సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగిన కాల్పుల్లో ఓ విద్యార్ధి చనిపోయాడనీ.. అతడి గురించి వివరాలు తెలుసుకునేందుకు సిద్దిఖి లోపలికి వెళ్లబోయారని తెలిపింది.
 
అయితే అక్కడే ఉన్న కొందరు తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. 'అనుమతి లేకుండా చొరబాటుకు ప్రయత్నించిన అభియోగాలపై ఆయన అరెస్ట్ అయ్యారు. అనంతరం ఈ నెల 15 వరకు నెగొంబో మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించారు' అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments