కరోనాతో భారత్‌కు తిప్పలు.. యూఏఈ బ్యాడ్ న్యూస్.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (11:04 IST)
కరోనా మహమ్మారితో భారత్‌కు తిప్పలు తప్పట్లేదు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో భారత్ నుంచి అన్ని విమానాలపై యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిషేధం ప్రకటించింది. మన దేశం నుంచి వెళ్లే అంతర్జాతీయ సర్వీసుల్లో మెజార్టీ విమానాలు యూఏఈలోని దుబాయ్, షార్జా మీదుగా వెళ్లేవే కావడంతో తాజా నిషేధ నిర్ణయం మొత్తం విమానయాన రంగంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. 
 
భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు, అంటే, మే 5 వరకు నిషేధం విధిస్తున్నట్లు యూఏఈ విమానయాన శాఖ గురువారం ప్రకటించింది. ఒక్కవిమానాలపైనే కాదు, భారతీయ ప్రయాణికులపైనా యూఏఈ కఠిన ఆంక్షలు విధించింది. ఇతర దేశాల్లో 14 రోజులపాటు ఉండని భారతీయ ప్రయాణికులను కూడా (యూఏఈలోకి) అనుమతించబోమని తెలిపింది. 
 
అయితే, యూఏఈ నుంచి భారత్ కు వచ్చే సర్వీసులు, కార్గో రాకపోకలు కొనసాగుతాయని, యూఏఈ పౌరులు, దౌత్య అధికారులు, సిబ్బంది, వ్యాపార వేత్తల విమానాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు యూఏఈ వెల్లడించింది. 
 
అయితే వీరంతా పది రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని, వచ్చిన రోజుతోపాటు, తర్వాత 4, 8 రోజుల్లో పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంది. ఈ కేటగిరి వ్యక్తుల ప్రయాణాలకు ముందుగా చేయించుకున్న కరోనా పరీక్ష గడువును 72 గంటల నుంచి 48 గంటలకు కుదించింది. కేవలం అనుమతించిన ల్యాబ్ రిపోర్టులను మాత్రమే అంగీకరిస్తామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments