Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరు వంతెనపై ముద్దుల్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన ప్రేమజంట (Video)

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (18:27 IST)
ఓ ప్రేమ జంట ముద్దుల్లో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. తమ విధులు ముగించుకుని అర్థరాత్రి ఇంటికి వెళుతూ వెళుతూ బెత్లహాం(పెరు) వంతెనపై నిలబడి ముద్దుల్లో మునిగిపోయి ప్రమాదావశాత్తు కిందపడి చనిపోయారు. 
 
ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, పెరూ దేశానికి చెందిన మేబిత్‌ ఎస్పింజ్‌(34), హెక్టార్‌ విడాల్‌(36) అనే ఇద్దరు ప్రేమికులు పర్వతారోహకులుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ క్యూసో పట్టణంలో పర్యాటక గైడ్లుగా కూడా పని చేస్తున్నారు. అయితే, ఇటీవల ఈ ప్రేమ జంట ముగించుకున్న తర్వాత అర్థరాత్రి ఒంటి గంట సమయంలో తమ నివాసాలకు బయల్దేరారు.
 
మార్గం మధ్యలో ఈ ప్రేమికులిద్దరూ బెత్లెహాం వంతెనపై ఆగి ముద్దుల్లో మునిగిపోయారు. ప్రియురాలు బ్రిడ్జి రెయిలింగ్‌పై కూర్చొని ఉండగా, ప్రియుడు ఆ రెయిలింగ్‌ను సపోర్ట్‌ చేసుకుంటూ నిలబడ్డాడు. 
 
ప్రియురాలికి ప్రియుడు ముద్దు ఇస్తున్న క్రమంలో వారిద్దరూ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయారు. 50 అడుగుల పైనుంచి కిందపడేసరికి ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments