Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌తో మేలు జరిగిందా? ఎలా?

Webdunia
ఆదివారం, 1 మార్చి 2020 (16:51 IST)
కరోనా వైరస్ కారణంగా చైనాకు చుక్కలు కనిపించాయి. కరోనా ప్రభావంతో జనాలు ఇళ్లలోంచి బయటికి రావడమే మానేశారు. ప్రభుత్వం కూడా అనేక ఆంక్షలు విధించింది. దీంతో అక్కడి పారిశ్రామిక రంగం కుంటుపడింది. ఇది చైనా ఆర్థికవృద్ధిని కుంగదీసినప్పటికీ.. వాయు కాలుష్యం మాత్రం మునుపెన్నడూ లేని స్థాయిలో తగ్గింది. తాజాగా నాసా వాయు కాలుష్యానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది.  
 
ఈ ఫోటోలు వాయు కాలుష్యానికి కారణమయ్యే నైట్రోజన్ డయాక్సైడ్‌కి సంబంధించింది. మోటార్ వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర కర్మాగారాలు ఈ గ్యాస్‌ను అధికమొత్తంలో విడుదల చేస్తుంటాయి. ఈ చిత్రాల ప్రకారం.. జనవరి మధ్య చైనా దేశ వాతావరణంలో నైట్రోజన్ డయాక్సైడ్ పరిమాణం అధిక స్థాయిలో ఉండగా.. ఫిబ్రవరి నెలలో దీనిస్థాయి భారీగా తగ్గిపోయింది. 
 
వైరస్ కేంద్రమైన వూహాన్ నగరంలో తొలుత నైట్రోజన్ స్థాయిలు తగ్గడం ప్రారంభించాయి. ఆ తరువాత.. ఆర్థిక రంగం నెమ్మదించే కొద్ది.. బీజింగ్, షాంఘాయ్ వంటి నగరాల్లోనూ వాయు కాలుష్యం భారీగా తగ్గిపోయింది. కరోనా కారణంగా వాయు కాలుష్యం ఈ స్థాయికి తగ్గుతుందని తాను భావించట్లేదని నాసా పరిశోధకులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments