Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాంతక వైరస్ దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న చైనీయులు

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (12:05 IST)
చైనాలో ప్రాణాంతక వైరస్ కరోనా దడ పుట్టిస్తోంది. ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో చైనీయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బుధవారం వరకు 132 మంది ఈ వ్యాధికి బలైతే, తాజాగా ఆ సంఖ్య 170కి చేరింది. 
 
అదేవిధంగా వ్యాధిగ్రస్తులు కూడా అంతకంతకు పెరుతున్నారు. బుధవారం వరకు వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆరు వేలు ఉంటే, ఇవాళ్టికి ఏడు వేలు దాటింది. వారిలో దాదాపు 1300 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తాజాగా ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తొమ్మిదివేలకు పైగా వ్యాధిగ్రస్తుల్లో 103 మంది కోలుకున్నట్లు చైనా అధికారికంగా తెలియజేసింది. 
 
అలాగే, విదేశీ పౌరులు ఎవరైనా తమ దేశాలకు వెళ్లాలనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తామని చైనా ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఈ వైరస్‌ 30 దేశాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వేల మందికి ఈ వైరస్ సోకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments