Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాలో ఆగస్ట్ 3న అందుబాటులోకి కరోనా వాక్సిన్

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (12:56 IST)
రష్యాలో ఆగస్ట్ 3వ తేదీన కరోనా వాక్సిన్ అందుబాటులోకి రానుంది. వచ్చే నెలలో దేశప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు రష్యా ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 
 
3 నుంచి రష్యా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను వేలాదిమందిపై నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సమాంతరంగా టీకాను కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 
 
ఇప్పటికే తొలి రెండు దశల క్లినియల్‌ ట్రయల్స్‌ విజయ వంతంగా పూర్తైనట్లు తెలిపారు. సెచెనోవ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ కరోనా టీకాపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధానంగా దృష్టి పెట్టారు. అన్ని సక్రమంగా జరిగితే ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా రష్యా వ్యాక్సిన్‌ నిలవనుంది. 
 
ఈ ఏడాది దేశీయంగా 3 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా ప్రకటించింది. మరో 17 కోట్ల డోస్‌లు విదేశాల్లో తయారవుతాయని తెలిపింది. వ్యాక్సిన్‌ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments