Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలంతో నాప్‌కిన్స్ - టిష్యూ - టాయిలెట్ పేపర్స్ తయారీ

విన్నూత్న ఆవిష్కరణలకు చైనా పెట్టింది పేరు. పైగా, ఏ చిన్న వ్యర్థాన్ని కూడా వారు వదిలిపెట్టరు. సరిగ్గా ఇపుడు అలాంటిదే జరుగుతోంది. ఈ దేశంలో పాండా మూగజీవులకు పెట్టింది పేరు.

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (15:29 IST)
విన్నూత్న ఆవిష్కరణలకు చైనా పెట్టింది పేరు. పైగా, ఏ చిన్న వ్యర్థాన్ని కూడా వారు వదిలిపెట్టరు. సరిగ్గా ఇపుడు అలాంటిదే జరుగుతోంది. ఈ దేశంలో పాండా మూగజీవులకు పెట్టింది పేరు. ఈ మూగజీవులు విసర్జించే మలంతో ఇపుడు టిష్యూ, టాయిలెట్ పేపర్లను తయారు చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసిందో కంపెనీ. 
 
సిచువన్ ప్రావిన్స్‌కు చెందిన క్యాన్‌వెయ్ ఫెంగ్‌షెంగ్ పేపర్ కంపెనీ, చైనా కన్జర్వేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌తో కలిసి పాండాల మలం, అవి తిని వదిలేసిన ఆహారం వ్యర్థాలతో నాప్‌కిన్స్, టాయిలెట్ పేపర్‌ను తయారు చేయనుంది. 
 
ఇప్పటికే వీటి తయారీ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో త్వరలోనే పాండా పూ పేరుతో ఈ టిష్యూ పేపర్లను చైనా మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. పాండా మూగజీవులు విసర్జించే మలాన్ని సేకరించి టిష్యూ పేపర్లను తయారు చేయనున్నట్టు తెలిపారు. 
 
సాధారణంగా ఒక పాండా సెంటరులో దాదాపు 10 కిలోల మలం చేరుతుందట. అంతేకాదు 50 కిలోల ఆహారం ప్రతి రోజూ వృధా అవుతోందట. దీన్నంతా సేకరించి, ప్రాసెస్ చేసి పేపర్స్‌గా ఆ కంపెనీ తయారు చేయనుంది. ఒక్క పాండా పూ బాక్స్ ఉన్న టిష్యూలు.. దాదాపు 43 యాన్లకు అమ్మాలని నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో సుమారుగా 416 రూపాయలన్నమాట. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments