Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బుల కట్టలు..ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన చైనా కంపెనీ

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (10:48 IST)
China
కరోనా సంక్షోభం, ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలైన గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, అమేజాన్, మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అలాగే వేతనాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులకు కోట్లలో బోనస్, జీతాలు పెంచిన ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
 
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో పనిచేస్తున్న హెనాన్ మైన్ అనే కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది. క్రేన్లతో సహా భారీ వాహనాలను తయారు చేసే ఈ కంపెనీ.. భారత్ సహా పలు దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.
 
కరోనా సంక్షోభం కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుండగా, హెనాన్ మైన్ ఆదాయం గత ఏడాదిలోనే 23 శాతం పెరిగింది. గతేడాది చివరి నాటికి కంపెనీ మొత్తం ఆదాయం 9.16 బిలియన్ యువాన్లు (దాదాపు రూ.11 వేల 86 కోట్లు). దీంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న కంపెనీ తమ ఉద్యోగులను తృప్తిపరిచేందుకు నిర్ణయించుకుంది.
 
ఈ కార్యక్రమంలో 61 మిలియన్ యువాన్ల (దాదాపు రూ. 73 కోట్ల 81 లక్షలు) విలువైన నగదు కట్టలను..  కంపెనీ వృద్ధికి బాగా పనిచేసిన వారికి అందజేసింది. ఇందులో 3 సేల్స్ మేనేజర్లకు 5 మిలియన్ యువాన్లు (దాదాపు రూ. 6 కోట్లు) బోనస్ అందించారు. మిగతా ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి 1 మిలియన్ యువాన్ (దాదాపు రూ. 1.20 కోట్లు) బహుకరించారు.
 
దీంతోపాటు ఈ కార్యక్రమంలో డబ్బుల లెక్కింపు పోటీ నిర్వహించి విజేతలకు గరిష్టంగా రూ.18 లక్షలు బహుమతిగా అందజేశారు. ఈ ఈవెంట్‌లో డబ్బు కుప్పలు తెప్పలుగా, ఇద్దరు ఉద్యోగులు చేతినిండా డబ్బులు తీసుకుని వెళ్తున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments