Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్‌లో వెనక్కి.. లిపులేక్‌లో మొహరింపు : డ్రాగన్ కంత్రీబుద్ధి

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (09:31 IST)
ఓ వైపు సమస్య పరిష్కారం కోసం భారత్‌తో చర్చలు జరుపుతూనే మరోవైపు చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనేవుంది. తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులను హతమార్చిన చైనా.. ఇపుడు లడఖ్ నుంచి తన సైనిక బలగాలను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఇండో - నేపాల్ సరిహద్దు ప్రాంతమైన లిపులేక్‌లో మొహరించింది. 
 
ఉత్త‌రా‌ఖం‌డ్‌‌లోని లిపు‌లేఖ్‌ పాస్‌ సమీ‌పం‌లోకి తమ సైన్యా‌న్ని పంపిం‌చిం‌దని భారత సైనిక వర్గాలు తెలి‌పాయి. లిపు‌లేఖ్‌ సరి‌హ‌ద్దు‌లకు కొంచం దూరంలో దాదాపు 1000 మంది చైనా సైని‌కులు ఉన్నట్టు పేర్కొ‌న్నాయి. 'ఎ‌ల్‌‌ఏసీ వెంబడి పరి‌స్థి‌తులు ఇంకా ఉద్రి‌క్తం‌గానే ఉన్నాయి. ఎల్‌‌ఏ‌సీకి తన‌వై‌పున ఉన్న భూభా‌గాల్లో చైనా మౌలిక సదు‌పా‌యా‌లను ఏర్పాటు చేసు‌కుం‌టు‌న్నది' అని ఇండియన్ ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు.
 
కాగా, నేపాల్‌, చైనా మధ్య ద్వైపా‌క్షిక సంబం‌ధాలు వృద్ధి చెందేం‌దుకు మరింత కృషి చేస్తా‌మని చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌‌పింగ్‌ తెలి‌పారు. చైనా - నే‌పాల్‌ ద్వైపా‌క్షిక సంబం‌ధాల 65వ వార్షి‌కో‌త్స‌వాలు ఇరు‌దే‌శాల్లో ఘనంగా జరు‌గు‌తు‌న్నాయి. ఈ నేప‌థ్యంలో నేపాల్‌ అధ్య‌క్షు‌రాలు బిద్యా‌దే‌వికి జిన్‌‌పింగ్‌ సందే‌శాన్ని పంపారు. 
 
కాగా, ఇటీవల లిపులేక్ ప్రాంతాన్ని నేపాల్ తమ భూభాగంగా ప్రకటించుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నేపాల్‌కు దగ్గరైన చైనా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏకంగా సైన్యాన్నే మోహరిస్తోంది. సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించి రోజులు కూడా గడవకముందే మళ్లీ తన సహజ వక్రబుద్ధిని బయటపెట్టుకుంది.
 
లిపులేఖ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఉత్తర ప్రాంతాల్లోని భారత సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తోంది. చైనా తీరుతో అప్రమత్తమైన భారత్ కూడా సరిహద్దుల వద్దకు సైన్యాన్ని తరలిస్తోంది. చైనా వెనక్కి తగ్గుతుందా? లేదా? అన్న దానితో సంబంధం లేకుండా తాము ఎప్పటికప్పుడు వివిధ ప్రాంతాలకు సైన్యాన్ని తరలిస్తున్నట్టు భారత సైన్యాధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments