అంతర్జాతీయ సినిమా ఉత్సవాలకు ఒక తెలుగు చిత్రం ఎంపికైంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ చిత్రాలు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జాబితాలో చోటుదక్కాలని, అక్కడ ప్రదర్శించాలని కలలుగంటుంటారు. కానీ, ఈ దఫా ఆ లక్కీ ఛాన్స్ నేచురల్ స్టార్ నానికి దక్కింది. ఆయన నటించిన జెర్సీ చిత్రం టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది.
క్రికెట్ పట్ల ఓ ఆటగాడికి ఉన్న అనురక్తిని ఎంతో హృద్యంగా, భావోద్వేగభరితంగా ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమాలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. గత యేడాది విడుదలై విమర్శలతో పాటు ప్రశంసలు అందుకుంది.
తాజాగా అపురూపమైన ఘనత దక్కించుకుంది. 'జెర్సీ' చిత్రం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు వెళుతోంది. నాని నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది.
ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆగస్టు 9 నుంచి 15 వరకు జరగనుంది. 'జెర్సీ' చిత్రమే కాకుండా, 'సూపర్ 30', కార్తీ నటించిన 'ఖైదీ' (తమిళ్) కూడా టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో సందడి చేయనున్నాయి.