Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కా ప్లాన్‌తో డ్రాగన్ దాడి ... నదిలోకి దిగగానే నీటిని వదిలి.. ఇనుప లాఠీలతో దాడి...

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (08:52 IST)
భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు చెలరేగాయి. ఒకవైపు చైనా స్నేహాస్తం అందిస్తూనే, మరోవైపు కుట్రలకు పాల్పడుతోంది. దీనికి నిదర్శనమే లడఖ్‌లోని గాల్వాన్ నదిలో భారత సైనికులపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడిని డ్రాగన్ కంట్రీ పక్కా ప్లాన్ ప్రకారం చేసిందని ప్రభుత్వ సీనియర్ అధికారులు చెబుతున్నారు. 
 
లడఖ్‌లో భారత దళాలను దొంగ దెబ్బ తీయడానికి చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) కనీసం రెండు రోజుల ముందే వ్యూహం రచించి ఉండొచ్చని పేర్కొంది. గల్వాన్‌ నదీ ప్రవాహానికి అడ్డుగా రాళ్లు పెట్టడం, భారత సైనికులు వచ్చిన వెంటనే వాటిని తొలగించి ప్రవాహ ఉధృతి పెరిగేలా చేయడం వంటి ఎత్తుగడలకు చైనా సైనికులు పాల్పడివుండొచ్చని పేర్కొంది.
 
'ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతి.. భారత సైనికులు బ్యాలెన్స్‌ కోల్పోయేలా చేసింది. అదే సమయంలో చైనా సైనికులు మనవాళ్లపై దాడికి దిగారు. తోసేశారు. దాంతో భారత సైనికులు గల్వాన్‌ నదిలో పడిపోయారు' అని ఆ అధికారి వివరించారు. 
 
యూఏవీ(అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌) ద్వారా భారత సైనికులు ఎంత మంది ఉన్నారనేది వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కి ఆవల నుంచే ధ్రువపరుచుకున్నారని పేర్కొన్నారు. చైనా సైనికులు హెల్మెట్లు, ఇతర రక్షణ పరికరాలు ధరించారని, మేకులున్న రాడ్‌లతో దాడికి పాల్పడ్డారని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments