Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. కత్తులు.. పైథాన్ పాములతో మసాజ్.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 మార్చి 2019 (09:58 IST)
మసాజ్.. ఫేషియల్ మసాజ్.. మజిల్ మసాజ్.. బాడీ మసాజ్.. థాయ్ మసాజ్.. ఇలా ఎన్నో రకాలైన మసాజ్‌ల పేర్లు వినివుంటారు. ప్రస్తుత రోజుల్లో ఫేషియల్, మసాజ్‌ల్లో కొత్త కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుందని, బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుందని మసాజ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తుంటారు. 
 
అంతేనా.. వాంపైర్ ఫేషియల్.. అంటే.. కస్టమర్ల రక్తంతోనే వారి ముఖంపై ఫేషియల్ చేయడం. గోల్డ్ మసాజ్.. అంటే.. 24 క్యారెట్ల గోల్డ్ కస్టమర్ల శరీరంపై పెట్టి మసాజ్ చేయడం. కేవియర్ ఫేషియల్ ఎంతో ఫేమస్.. ఉప్పు చేపతో ఫేషియల్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కామన్ అయిపోయాయి. అందరూ చేయించుకుంటున్నారు. 
 
అయితే, ఇటీవల సరికొత్త మసాజ్ టెక్నిక్స్ చైనాలో అందుబాటులోకి వచ్చాయి. అవి ఇపుడు ట్రెండింగ్ అవుతున్నాయి. రిలాక్స్ అయ్యేందుకు ఈ సరికొత్త టెక్నిక్స్ చైనావాళ్లు ఫాలోఅవుతున్నారు. అయితే, ఈ మసాజ్ ఇప్పటివరకూ మీరు విన్న మసాజ్‌లకు పూర్తిగా భిన్నమైంది. రెండే రెండు మసాజ్ టెక్నిక్స్.. చైనా యువత అంతా ఈ మసాజ్‌లు చేయించుకునేందుకు ఎగబడుతున్నారు. ఇదే ట్రెండింగ్‌గా మారిపోయింది.
 
అవేంటో తెలుసా? ఒకటి నైఫ్ మసాజ్. రెండోది.. స్నేక్ మసాజ్. ఏంటి.. షాక్ తిన్నారా? అమ్మో కత్తులు.. పాముతోనా అనుకుంటున్నారా? మీరు నమ్మిన నమ్మకపోయినా.. ఇది నిజం. అక్కడ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఒక టేబుల్‌పై మసాజ్ చేయించుకునే వ్యక్తిని పడుకోబెడతారు.. మసాజ్ చేసే నిర్వాహాకులు.. మెల్లగా రెండు పదునైనా కత్తులు తీసుకొస్తారు..
 
ఈ కత్తులు చూడ్డానికి చుర కత్తుల్లా ఉంటాయి. మాంసం నరికే కత్తులా కనిపిస్తాయి. మసాజ్ చేయడానికి ముందు.. రెండు కత్తులను బాగా సానబెడతారు. ఆ తర్వాత మసాజ్ థెరపీ స్టార్ట్ అవుతుంది. పడుకున్న వ్యక్తిపై ఒక్కమందమైన దుప్పట్టా కప్పుతారు. ముఖం పై నుంచి కాళ్ల వరకు కప్పేస్తారు. రెండు కత్తులను తలో ఒకటి తీసుకుని మాంసం ముక్కలు నరికినట్టు తలభాగం నుంచి కాళ్ల వరకు కొడుతుంటారు. అంతేకాదు.. మసాజ్‌కు ముందు రెండు కత్తులకు ఆయిల్ పూసి మసాజ్ చేస్తుంటారు. సాధారణ కత్తులు కాదు ఇవి.. నైఫ్ థెరపీ కోసం స్పెషల్‌గా కత్తులను తయారు చేయిస్తారు. 
 
అలాగే, మరో వెరైటీ మసాజ్.. స్నేక్ థెరపీ. స్నేక్ థెరపీ కోసం వాడే పాము పైథాన్.. 50 కేజీల కోల్డ్ బ్లడ్ ఫైథాన్. వణుకుపుట్టించే కొండచిలువతో ఒళ్లంతా పాకిస్తారు. ఈ కొండచిలువ రక్తం చాలా చల్లగా ఉంటుంది. పైథాన్‌తో మసాజ్ థెరపీ చేయించుకుంటే వారి బాడీ ఫుల్‌రిలాక్స్ అవుతుందట. ఏం... స్నేక్ థెరపీనో.. ఏమోగానీ.. మసాజ్ చేయించుకునేందుకు వచ్చినవారంతా భారీ కొండచిలువను చూసి హడలిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

Srivishnu: అల్లు అరవింద్ ప్రజెంట్స్ లో శ్రీ విష్ణు హీరోగా #సింగిల్ చిత్రం

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments