ముగ్గుర్ని కనండి : త్రీ చైల్డ్ పాలసీకి చైనా ఆమోదం..

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:25 IST)
డ్రాగన్ కంట్రీ చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్ల‌ల విధానానికి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. ఆ చ‌ట్టాల‌ను అమ‌లు చేయాల‌న్న ప‌త్రాల‌పై చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ సంత‌కం చేశారు. 
 
చైనాలో నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ 13వ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశాలు ముగిశాయి. ఆ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప‌లు కీల‌క బిల్లుల‌కు ఆమోదం ద‌క్కింది. ఇందులోనే జనాభా, కుటుంబ నియంత్ర‌ణ చ‌ట్టాన్ని కూడా స‌వ‌రించారు. 
 
చైనా త్రీ చైల్డ్ పాలసీకి ఆమోదం తెలపడానికి కారణాలు లేకపోలేదు. చైనాలో 60 ఏళ్ల వ‌య‌సు దాటిన వారి సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతున్న నేప‌థ్యంలో ఇవాళ ఆ దేశం ముగ్గురు పిల్ల‌ల విధానాన్ని తీసుకువ‌చ్చింది. 
 
గ‌త 40 ఏళ్ల నుంచి ఆ దేశంలో ఒక జంట ఒక్క‌ర్నే క‌నాల‌న్న నిబంధన ఉండేది. ఇప్పుడు జ‌నాభా, కుటుంబ నియంత్ర‌ణ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌తో ఆ సంఖ్య మూడుకు చేరింది.
 
పైగా, ముగ్గురు పిల్ల‌ల్ని క‌నే దంప‌తుల‌కు చైనా ప్ర‌భుత్వం తోడ్పాటు ఇవ్వ‌నుంది. ఫండింగ్‌, ట్యాక్సేష‌న్‌, ఇన్సూరెన్స్‌, ఎడ్యుకేష‌న్‌, హౌజింగ్‌, ఎంప్లామెంట్‌లో వారికి చేయూత‌నివ్వ‌నున్నారు. 
 
ఇది దేశ జ‌నాభా స్వ‌రూపాన్ని మార్చేస్తుంద‌ని, వ‌య‌సు మ‌ళ్లుతున్న వారి సంఖ్య‌కు త‌గిన‌ట్లు కొత్త త‌రం వ‌స్తుంద‌న్నారు. 2020 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం.. చైనా జ‌నాభాలో 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 18.7 శాతంగా వుంది. 
 
2010తో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అంచ‌నా వేశారు. రెండో బిడ్డ‌ను క‌నేందుకు 2013లో చైనా ఆమోదించింది. పెళ్లి చేసుకున్న దంప‌తులు ఖచ్చితంగా ఇద్ద‌ర్ని క‌న‌వ‌చ్చు అంటూ 2016లో మ‌రో చ‌ట్టం చేశారు. ఇపుడు త్రీ చైల్డ్ పాలసీకి ఆమోదం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments