Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నాసా ఉపగ్రహంతో విక్రమ్ చిత్రీకరణ

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (11:09 IST)
చంద్రుడి ఉపరితలంపై నిస్తేజంగా ఉన్న విక్రమ్ ల్యాండర్‌ను ఫోటో తీసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయత్నాలు చేపట్టింది. ఇందులోభాగంగా మంగళారం నాసా ఉపగ్రహం విక్రమ్‌ను ఫోటో తీయనుంది. ఈ ఫోటోలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు అందజేయనుంది. ఈ ఫోటోలు తాజా స్థితిగతులపై మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, చంద్రుడి దక్షిణ ధృవం అన్వేషణ నిమిత్తం ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులోభాగంగా, ఈ నెల 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడు దక్షిణ ధృవంపై దించేందుకు ప్రయత్నించగా చివరి క్షణంలో సంబంధాలు తెగిపోయాయి. దీనికి కారణంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడుపై సున్నితంగా కాకుండా, హార్డ్ ల్యాండింగ్ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత విక్రమ్‌తో భూమికి సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు ఇస్రో శతవిధాలా ప్రయత్నిస్తోంది.
 
కానీ, అది వీలుపడటం లేదు. ఈ నేపథ్యంలో అసలు విక్రమ్ ల్యాండర్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది అన్న విషయాన్ని గుర్తించేందుకు నాసా లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ)ను మంగళవారం చంద్రుడిపైకి పంపనుంది. ఇది మంగళవారం చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలో పరిభ్రమించి విక్రమ్ ల్యాండర్‌ను ఫోటోలు తీసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం