Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రేయసిని ఈ కత్తితో చంపా... కొంటారా...? కత్తిని అమ్మకానికి పెట్టిన ప్రియుడు

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (12:45 IST)
తన ప్రియురాలిని కత్తితో అతిదారుణంగా హతమార్చి ఆపైన కత్తిని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడో ప్రేమ పిశాచి. 'ఒకరిని ముక్కలు ముక్కలుగా చేసేందుకు ఒక్కసారి మాత్రమే ఈ కత్తిని ఉపయోగించాను. ఇది ఇప్పటికీ కొత్తదే తళతళ మెరిసిపోతుంది చూడండీ. దీనిని ఎవరైనా కొంటారా? అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఈ కిరాతకుడికి (40 ఏళ్ల బ్రియాన్‌ బ్రిమేజర్‌)కు అమెరికా కోర్టుకు 26 ఏళ్ల శిక్ష విధించింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే... కాలిఫోర్నియాకు చెందిన ఈ ప్రబుద్ధుడు తన ప్రియురాలైన 42 ఏళ్ల యోన్నెలీ బాల్డెలీతో పనామాలో 2 నెలలపాటు కలిసి జీవించాడు. ఏమైందో ఏమోగానీ అతికిరాతకంగా పొడిచి చంపాడు. ఆ తర్వాత ఆమె దేహాన్ని ముక్కముక్కలు చేసి పనామాలోని ఓ దీవిలో పడేశాడు. గతంలో సాన్‌డియాగోలో నావికుడిగా పనిచేసిన అతను హత్య చేసిన వెంటనే తన స్నేహితుడికి ఓ ఈమెయిల్‌ కూడా పంపాడు. పనామాలో తాను ఆనందభరితమైన జీవితాన్ని గడుపుతున్నట్టు ఆ ఈమెయిల్‌లో సందేశం పంపాడు. 
 
2013లో పనామా వాసులు ఓ మహిళ అస్తిపంజరాన్ని గుర్తించడంతో అతడు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. పనామా వాసులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ కిరాతకుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణలో అతడు నేరం అంగీకరించి.. యోన్నెలి కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పాడు. అయితే ఈ కిరాతకుడిని క్షమించవద్దని, కఠినంగా శిక్షించాలని బాధితురాలు యోన్నెలీ కుటుంబసభ్యులు కోరారు. దీంతో కోర్టు అతడికి 26 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments